దేశంలో రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పోతూ సామాన్యులకు భారంగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుతం భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు మరింత భారంగా మారిపోతున్నాయి.  ఇక పెట్రోల్ ధరలు తగ్గుతాయేమో అనిపేద మధ్య తరగతి ప్రజలు ఎంతగా వేచి చూసినప్పటికీ కూడా రోజు రోజుకు పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. ఒకవేళ పెట్రోల్ ధరలు తగ్గిన కేవలం పైసల్లో  తగ్గడం..  పెరిగేటప్పుడు మాత్రం రూపాయల్లో పెరగడంతో మరింత భారం పడుతుంది పేద మధ్యతరగతి ప్రజలపై.



 ఇక పెట్రోల్ ధర ఏకంగా 90 రూపాయలకు చేరుకోవడంతో ప్రస్తుతం అందరూ బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనీసం వాహనం తీసి బయటకు వెళ్లాలంటే పెట్రోల్ ధరలు చూసి భయపడే పరిస్థితి ఏర్పడిందిప్రస్తుతం దేశంలో. ఇలా రోజురోజుకు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో... పేద మధ్య తరగతి ప్రజలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పెట్రోల్ ధరలు భారీగా పెరగడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 దేశంలో పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లీటర్ పెట్రోల్ ధర గరిష్టంగా కేవలం 40 రూపాయలు మాత్రమే ఉండాలని అలా అయితేనే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారు అంటూ అభిప్రాయం వ్యక్తంచేశారు బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయలు ఉంది అంటే అది భారత ప్రజలందరినీ దోచుకుంటున్నట్టే  అంటూసంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ రిఫైనరీలో పెట్రోల్ ధర కేవలం 30 రూపాయలు మాత్రమేనని ఇక మిగితా అన్ని టాక్స్లు పన్నులు కలుపుకుంటే కేవలం 60 రూపాయలు మాత్రమే ఉంటుందని తెలిపిన సుబ్రహ్మణ్య స్వామి తన దృష్టిలో మాత్రం పెట్రోల్ ని గరిష్ఠంగా 40 రూపాయలకు మాత్రమే నమ్మితేనే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: