తిరుపతిలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే.. అదేంటంటే  ములకలచెరువు మండలం సోంపాళ్యం పరిధిలోని గుట్టకిందపల్లికి చెందిన సుమతి నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. మరో ఏడురోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న సుమతిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. శరీరంపై మంటలు వ్యాపించి ఆమె తీవ్రగాయాలపాలైంది.. ఇంకో  వారంలో పెళ్లి జరగనున్న ఆమె జీవితం అగ్నికి ఆహుతి కావడం నిజంగా బాధాకర విషయం..  


పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి ఇలా చితికి ఆహుతి కావడం తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ ఘటన వెనుక నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి.. తన రెండోవ అక్క భర్తనే కారణమని పోలీసులు గుర్తించారు. గతంలో చాలా సార్లు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు సమాచారం.. ములకలచెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుండగా శివన్న రెండవ కుమార్తె మాధవి భర్త వెంకటేష్ న‌ మరదలు సుమతిపై పెట్రోల్ పోసి పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది.
 


ములకలచెరువు ఎస్సై రామకృష్ణ కథనం మేరకు..
రెండవ కుమార్తె మాధవి భర్త వెంకటేష్ తన‌ మరదలు సుమతితో తనకు  రెండో వివాహం చేయాలని ఏడాదిన్నర కాలంగా ఘర్షణ పడుతున్నట్లు తెలిసింది. సుమతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించి వారం రోజుల్లో పెళ్లచేయాల్సి వుండగా, వెంకటేష్ గురువారం ఉదయం సుమతి ఇంట్లోకి బలవంతంగా చొరబడి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా సుమతి ఇంటి ముందర ఉన్న రెండు వీధికుక్కలను, ఆరు పెంపుడు కోళ్లకు తిండిలో ఫ్లోరైడ్ గుళికల మందు కలిపి పెట్టి వాటిన అంతమొందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమతి అమ్మను ,అక్కను ప్రశ్నించి వారినుంచి అసలు విషయం రాబట్టినట్లు తెలుస్తోంది. తన మరదలను తనకు రెండో వివాహం చేయడానికి ఇవ్వనందుకే వెంకటేష్ ఈ హత్యాయత్నం చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: