పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించరాదన్న ప్రభుత్వ వైఖరిపైన, ఎన్నికలు జరగబోయే అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పొత్తుల ఖరారు అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి బాధ్యతలను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ చూసుకోనున్నారు.
అసమ్మతి నేతలతో భేటీ జరగడానికి కమల్‌నాథ్ ప్రధాన కారణం. ఆయనే చొరవతీసుకుని ఈ భేటీ జరిగేలా చూస్తున్నారు. అయితే రాహుల్‌కు పార్టీ పగ్గాలు తిరిగి అప్పగించడానికి ఓ ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన సమయంలోనే 23 మంది సీనియర్లు సోనియాకు లేఖాస్త్రం సంధించారు. పైలట్‌ను బుజ్జగించి, మనసు మార్చడంలో కీలకపాత్ర పోషించిన ప్రియాంక, రాహుల్.... సీనియర్లకు చెక్ పెట్టడంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. అయితే ఆజాద్ సహా మరో ముగ్గురు సీనియర్లు ప్రతివ్యూహాన్ని రచించి రాష్ట్రాలు, ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెస్ నేతలను కూడగట్టి లేఖను రాశారు.
కాంగ్రెస్ కు ఎంతో కీలకమైన మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలను కోల్పోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలను సాధించకపోవడంపైనా ఉన్నత స్థాయి నేతలు అసమ్మతి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ముగిసింది.. అంటూ సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి