కరోనా భయం ప్రపంచాన్ని ఇంకా వీడలేదు. రూపు మార్చుకుని మళ్ళీ యావత్ మానవాళిని భయబ్రాంతులకు గురి చేయబోతోందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి ఈ భయం పొంచి ఉంది. దాంతో, మన దేశం కూడా అప్రమత్తమవుతోంది. వివిధ రాష్ట్రాలు కూడా ముందు జాగ్రత్తల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.


మహారాష్ట్రలో ఇప్పటికే రాత్రివేళ కర్వ్యూ అమలు పరుస్తున్నారు. కాగా, కర్ణాటక రాష్ట్రంలో 15 రోజుల ముందు నుంచి వచ్చిన ప్రయాణికుల లెక్కలు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సరికొత్త కరోనాకి సంబంధించి వివరాలు సేకరిస్తోంది. అంతేకాకుండా దేశంలోకి విమానాలు రాకుండా రద్దు చేసారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


కొత్త స్ట్రెయిన్ ముప్పును సంబంధించి పాజిటివ్ వస్తే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులపాటు ఐసోలేషన్ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోకి అడుగుపెట్టినవాళ్ల సంఖ్య 2291మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ముప్పు పొంచి ఉందని చెబుతూ ప్రజలకు అవగాహన కలిగించేందుకు వివిధ కార్యక్రమాలు నివహిస్తున్నారు. 


హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఐసిఎంఆర్, ఎంఏబీఎల్ సర్టిఫైడ్ ల్యాబ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది కోసం 24 గంటలూ ఈ ల్యాబ్ పనిచేస్తుంది. విమాన ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసిన తర్వాత నాలుగు గంటల్లో రిపోర్ట్ ను ఈ మెయిల్, వాట్స్ అప్, హార్డ్ కాపీల ద్వారా ఇస్తున్నారు. 
కొత్త స్ట్రెయిన్ విషయమై నిర్లక్ష్యం తగదని, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే క్వారెంటైన్ కేంద్రాలకు పంపించాలని కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: