ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాల ప్రజలందరికీ వ్యాక్సిన్ అందె విధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర ప్రభుత్వం.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు కూడా చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దానిపై ప్రస్తుతం ప్రజలందరిలో అయోమయం నెలకొంది. కరోనా వ్యాక్సిన్ పొందేందుకు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానిపై ఎంతోమంది ఆలోచనలో పడ్డారు.
కాగా త్వరలో ప్రారంభమయ్యే వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కరోనా వ్యాక్సిన్ పొందేందుకు కేంద్రం కో- విన్ అనే యాప్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న యాప్ లో పేరు నమోదు చేసుకొని ఒక ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక మీ పేరుమీద వ్యాక్సిన్ రిజిస్టర్ అయి ఉంటుంది. అయితే కరోనా వారియర్స్కు వ్యాక్సిన్ పూర్తిగా ఉచితం అంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఇక సామాన్య ప్రజలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తారా లేక కొంత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తారన్న దానిపై మాత్రం ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కో-విన్ అనే యాప్ ఇంకా విడుదల కాక పోయినప్పటికీ దీని పేరు తో ప్లే స్టోర్ లో ఎన్నో యాప్ లు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి