రోజురోజుకు భారత్ కాస్త డిజిటల్ భారత్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. నగదు లావాదేవీలు కాస్త  డిజిటల్ పేమెంట్స్  గా మారిపోతున్నాయి ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కూడా డిజిటల్ పేమెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయడం ద్వారా ఎంతో సురక్షితమైన నగదు రహిత లావాదేవీలు చేసేందుకు వీలు ఉంటుందని అందరూ నమ్ముతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారా డిజిటల్ పేమెంట్స్  చేసే వారికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  హెచ్చరిక జారీ చేసింది.



 యూపీఐ ప్లాట్ అప్ గ్రేడేషన్  ప్రక్రియలో భాగంగా రాబోయే కొద్ది రోజులపాటు రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు డిజిటల్ పేమెంట్స్  చేయకుండా ఉండాలి అంటూ సూచించింది. అయితే ఎన్ని రోజుల వరకు ఇలా రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు డిజిటల్ పేమెంట్ చేయకుండా ఉండాలి అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రాబోయే కొద్ది రోజులు మాత్రమే అని మాత్రమే తెలిపింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.



 అయితే ప్రస్తుత కాలంలో ఆన్లైన్ లావాదేవీల పైన ఎక్కువగా ఆధారపడుతున్న జనాలు.. యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారానే ఎక్కువగా లావాదేవీలు జరుపుతున్నారు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం భీమ్ యూపీఐ ఫ్లాట్ ఫామ్ లో 165 బ్యాంకులు  లింక్ అయి ఉన్నాయి. కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  ఎక్కువమంది యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరిపారు.  ఇక రోజు రోజుకు యూపీఐ ద్వారా పేమెంట్ జరుపుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక యూట్యూబ్ ద్వారా లావాదేవీలు జరిపితే  ఎన్నో డిస్కౌంట్ కూపన్లు క్యాష్ బ్యాక్ ఆఫర్లు  కూడా లభిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: