హైదరాబాద్: ప్రధాని రాష్ర్ట పర్యటన సందర్భంలో కొన్ని మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులకు అనుమతి నిరాకరించడంపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. మీడియా పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరును నిరసిస్తూ జర్నలిస్టులు అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు. గన్ పార్కు వద్ద తమ నిరసనను వ్యకత్ చేశారు. ప్రజాస్వామ్య దేశమనీ గొప్పలు చెప్పుకునే మన దేశంలో కలాలు వెలికి గురికి కావడాన్ని తెలంగాణ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. వందలాదిగా అసెంబ్లీ వద్దకు చేరుకున్న జర్నలిస్టులు అక్కడే బైఠాయించారు. వారికి మద్దతుగా పలు ప్రజాసంఘాల ప్రతినిధులు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తదితరులు చేరుకున్నారు. జర్నలిస్టల బైఠాయింపుతో అసెంబ్లీ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడ్డది. ర్యాలీకి అనుమతి లేదనీ పోలీసులు ఎక్కడికక్కడే జర్నలిస్టులను అడ్డుకున్నారు. గన్ పార్కు నుంచీ ఇందిరాపార్కు వద్దకు వెళ్లాలనుకున్న జర్నలిస్టలు గన్ పార్కు వద్దనే అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులకు-జర్నలిస్టులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. నిరసనను తెలిపై హక్కును కూడా హరించివేడయాన్ని జర్నలిస్టులు, ప్రజసంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాని పాల్గొన్న జీవ వైవిధ్య సదస్సులో వార్తల సేకరణకు తెలంగాణ ప్రాంత మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరణపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్నజర్నలిస్టులు ముక్తకంఠంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. పది రోజుల్లో సీఎం కిరణ్, డీజీపీ దినేష్ రెడ్డి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలనీ, లేని పక్షంలో గత నెల 30న నిర్వహించిన తెలంగాణ మార్చ్ మాదిరిగానే కలం కవాత్ను నిర్వహిస్తామనీ జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: