గుంటూరు జిల్లా లో హత్యకు గురైన చత్తీస్గడ్ యువకుడి మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. యువరాజ్ విశ్వకర్మ అనే యువకుని అతడి స్నేహితుడే దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ చెన్నై మధ్య మూడో రైల్వేలైన్ నిర్మాణం పనులు జరుగుతుండగా ఇక్కడపనిచేస్తున్న 150మంది కోసం ఒక క్యాంప్ ఏర్పాటు చేసింది.
ఇక్కడే ఛత్తీస్గఢ్ కు చెందిన యువరాజ్ విశ్వకర్మ.. రెండేళ్లుగా ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే అతనికి అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. ఇక పశ్చిమ బెంగాల్కు చెందిన అమర్జీత్ అనే యువకుడు పంప్ ఆపరేటర్ గా పని చేస్తుండగా.. వీరిద్దరి మద్య స్నేహం కుదిరింది. అయితే ఇటీవలే ద్విచక్ర వాహనం తో అమర్జిత్ వృద్ధురాలిని ఢీ కొట్టడంతో ఆమె చనిపోయింది. ఈ కేసులో రాజి కోసం రెండు లక్షల రూపాయలు అవసరమయ్యాయి. స్నేహితుడు యువరాజ్ విశ్వకర్మను డబ్బులు కావాలి అంటూ అడిగాడు అమర్జీత్. కానీ అతడు ఇవ్వడం కుదరదు అన్నాడు.
ఈ క్రమంలోనే విశ్వకర్మ పై పగ పెంచుకున్నాడు అమర్జీత్. జనవరి 23వ తేదీన క్యాంప్ ఆఫీస్ నుండి బైక్ పై బయలుదేరి వెళ్తున్న సమయంలో.. ఓ చోట నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ క్రమంలోనే తనకు డబ్బు ఇవ్వాలని విశ్వకర్మ తో వాగ్వాదానికి దిగాడు అమర్జిత్. స్నేహితుడితో ఘర్షణ పడి ఏటీఎం లాక్కున్నాడు. ఇక ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో స్నేహితుడిని దారుణంగా పొడిచి ఎటిఎం పిన్ నెంబర్ చెప్పాలి అంటూ ఒత్తిడి చేశాడు అయినప్పటికీ అతను పిన్ నెంబర్ చెప్పకపోవడంతో దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఓ నిర్మానుష్య ప్రాంతంలో పాతి పెట్టాడు. ఈ క్రమంలోనే ఇక విశ్వకర్మ కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా విచారణలో ఊహించని నిజాలు బయటపడ్డాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి