ఆంధ్ర రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తారు అన్నది వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీలలో అత్యంత ముఖ్యమైనది. దీనిని నమ్మే ఎంతోమంది అక్క చెల్లెమ్మలు జగనోరికి ఓటేశారు. అయితే జగనోరి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఏడాదిన్నర గడుస్తోంది. అయితే మద్యం నిషేధం అంశంపై రాష్ట్రంలో ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఏంటి అన్న అంశంపై మాట్లాడారు రాజకీయ విశ్లేషకుడు సాయి. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించి.. తెలుగింటి ఆడపడుచులకు మేలు చేస్తానన్నది జగనోరు ఇచ్చిన హామీ.  అయితే మద్యం ధరలను పెంచడం అన్నది ప్రభుత్వ విధానం.

దానికి మొదటి నుండి చెప్పుకు వచ్చింది, ఏడాది ఏడాదికి ధర పెంచుతూ.. మందుబాబులు తాగడానికి షాక్ కొట్టే అంతగా ధరలు తీసుకొస్తాం.. తద్వారా చివరికి మద్యం నిషేధం దిశగా తీసుకెళ్తాం. కేవలం స్టార్ హోటల్ లాంటి వాటిల్లో.. అంటే భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయగల వారికి మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ఆ పాలసీ ప్రారంభం అయినప్పటి నుండి కొట్టుకుంటున్నది ప్రతిపక్షాలే అని పేర్కొన్నారు సాయి. అక్కడ వాస్తవంగా అదేదో జగన్ తినేస్తాడు లేకపోతే వేరే రూపంలో దోచుకుంటాడు అనేది వారి ఆరోపణలు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేయమని పేర్కొంది.

లేదంటే గతంలో తెలుగుదేశం పార్టీ మద్యాన్ని హఠాత్తుగా నిషేధించినపుడు మందు బాబులకు ఒక్కసారిగా మందు దొరకక పొయేసరికి  పిచ్చెక్కి పోయింది. అప్పట్లో పరిస్థితి గందరగోళంగా మారింది. కొంతమందికి మానసిక సమస్యలు, శారీరక సమస్యలు రావడం, కొందరు బ్లాకులో కొనడం, అనేకమంది కల్తీ మద్యం తాగడం వంటివి చేశారు. కొంతమంది అయితే ఏకంగా తన ప్రాణాలను సైతం కోల్పోయారు. అయితే ఇవన్నీ వంకరగా చూపి అప్పట్లో మధ్య విషాదాన్ని ఎత్తేసి మళ్లీ యధావిధిగా అందుబాటులోకి తెచ్చారు అన్న విషయాన్ని గుర్తు చేశారు సాయి.

మద్యం అనేది రాజకీయ నాయకులకు అయాచిత వరం అని ఆయన పేర్కొన్నారు. వాస్తవంగా అధికారంలో ఉన్నవారు తమ వాళ్ళకి ఆ మద్యం దుకాణానికి సంబంధించిన లైసెన్సును అప్పగించాలని అనుకుంటారు. కానీ జగన్ సర్కార్  ఇక్కడ అలా చేయలేదు.. మళ్లీ నెక్స్ట్ వస్తే ఆ హయాంలో ఏమైనా చేస్తుందేమో తెలీదు కానీ.. ఈ ట్రిప్ మాత్రం అటువంటిది ఏమి చేయలేదు అని క్లారిటీ ఇచ్చారు సాయి. కావాలనుకుంటే వాళ్ల వాళ్ల అందరికీ బెల్టు షాపులను ఇచ్చి ఉండొచ్చు జగన్ సర్కారు కానీ అలా చేయలేదు. పర్మిట్ రూమ్ లను ఎత్తేసి చివరికి బెల్టుషాపులు కూడా ఎత్తేసి తీసుకొచ్చినటువంటి చర్య దానికితోడు ఇంకా కొన్ని జరుగుతుండవచ్చు లోపాలు అని చెప్పుకొచ్చారు సాయి.

కానీ ప్రభుత్వ పాలసీ గా.. ప్రైవేటు అమ్మకాలు కాకుండా అక్కడ నేరుగా ప్రభుత్వమే అమ్మే అటువంటి కార్యక్రమాన్ని చేస్తోంది. ఇది నిజంగా కాస్త మెరుగైన విషయం. మొన్న కరోనా నేపథ్యంలో.. దశలవారీగా ధరల పెంచే దిశలో మద్యం ధరలు పెంచితే... దానిని కాస్త వివాదం చేసి ప్రభుత్వం దిగొచ్చి ధరలు తగ్గించేలా చేశారు ప్రతిపక్షాలు. మరి ఇప్పుడేమో పేదవాడికి మళ్లీ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సహకరించారు వీరందరూ. ఈ సందర్భంలో మద్యనిషేధ స్ఫూర్తి ఇక చచ్చిపోయిందా అంటున్న  సందర్భంలో... తాజాగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రచారాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది అన్నారు సాయి.

ఇంతకీ ఆ విషయం ఏంటంటే... దీనమ్మ జీవితం దశలవారీగా మద్యం నిషేధిస్తాము అని చెప్పి  ప్రజలను నమ్మించి దొడ్డిదారిలో గెలిచింది జగనోరి ప్రభుత్వం అని ఆ ప్రకటనలో ఉంది.. అయితే దొడ్డిదారిలో అంటే... ఎన్నికలు లేకుండా నేరుగా నియమితుడయ్యారా జగన్ అని టీడీపీపై చురకలు వేశారు సాయి. ఇక వారు పేర్కొన్న మరో విషయం ఏమిటంటే, 2019 నుండి ఇప్పటివరకు మద్యనిషేధం అన్న మాట పక్కన పెడితే.. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో లేని మద్యం ధరలు ఈ రాష్ట్రంలో అమాంతం పెరిగిపోయాయి. ఏది ఏమైనప్పటికీ 2024 సంవత్సరం అయ్యే లోపు మద్యపాన నిషేధాన్ని చేస్తే...ప్రభుత్వం కరెక్ట్ లేదంటే కరప్ట్ అని అర్ధం..మరి ఏమి జరుగుతుందో చూద్దాం అని ముగించారు సాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: