ఇండియన్ ఆయిల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వాహనదారులు 50 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు. ఇందుకు వినియోగదారులు చేయాల్సిందల్లా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా వచ్చే ఫ్యూయెల్ రివార్డు పాయింట్లు రిడీమ్ వేసుకోవడమే. ఇలా చేస్తే ప్రతి ఏడాదికి 50 లీటర్ల వరకు పెట్రోల్ ఫ్రీగా పొందొచ్చు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పైకి ఎగబాకుతున్న నేపథ్యంలో 50 లీటర్లు పొందొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ శుభవార్త అందించడం తో వినియోగదారులు ఎగిరి గంతేస్తారు.
ఇక క్రెడిట్ కార్డు లో ఫ్యూయెల్ రివార్డ్ పాయింట్స్ పెంచుకోవాలి అనుకుంటున్న వారు ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్స్ లో పెట్రోలు కొట్టించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే 5 శాతం ఫ్యూయెల్ పాయింట్స్ పొందొచ్చు. నెల రోజులు ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్స్ లో పెట్రోల్ పోయించుకోవడం వలన నెలకు గరిష్టంగా 250 రివార్డ్ పాయింట్స్ సంపాదించవచ్చు. అలాగే ఈ రివార్డ్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకొని అవసరమైనప్పుడు ఉచితంగానే పెట్రోల్ పొందొచ్చు. పెట్రోల్ మీద కాకుండా ఇతర వస్తువులు, సరుకులను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అయితే 150 రూపాయలతో క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా కొనుగోలు చేసినట్లయితే 1 రివార్డ్ పాయింట్ లభిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పొందాలనుకునేవారు ఆఫీషియల్ బ్యాంకు ఖాతాలో రూ.10, 000 ఉండేటట్లు చూసుకొని వెబ్సైట్ కి వెళ్లి క్రెడిట్ కార్డు కి దరఖాస్తు చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి