అయితే పిఎం కిసాన్ యోజన ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 వాయిదాల్లో రైతులకు నగదు బదిలీ చేసింది. త్వరలో 8 వ విడత బదిలీకి సిద్ధంగా ఉంది. ఈ పథకం పాత విధానంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయబోతోంది. ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మన్ పథకం ప్రయోజనం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఇవ్వబడుతుంది. మార్చి నెలలో ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరొచ్చని తెలుస్తోంది. నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
అయితే బెనిఫీసియరీ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లిస్ట్‌లో పేరు లేకపోతే డబ్బులు రావు. ఉంటేనే డబ్బులు వస్తాయి. దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మీకు ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, ఊరు పేరు ఎంటర్ చేసి మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరి ఉండకపోతే.. ఇప్పుడు కూడా ఆన్‌లైన్‌లోనే ఈ పథకంలో చేరొచ్చు. దీని కోసం మీ బ్యాంక్ అకౌంట్, పొలం పాస్‌బుక్, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి