ఆరోగ్యమే మహా బలం అని చెబుతూ ఉంటారు పెద్దలు..  ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెబుతూ ఉంటారు.  కాని నేటి రోజుల్లో మాత్రం ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది ఎవరికి. అధునాతన జీవనశైలిలో.. కొత్త కొత్త అలవాట్లు... వినూత్న లైఫ్ స్టైల్ కొన్ని విషయాల్లో  మంచి చేస్తున్నప్పటికీ చాలా విషయాల్లో మాత్రం చేటు చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాలు కూడా అందరికీ చేటు చేసే విధంగానే ఉన్నాయి.  సాధారణంగా ప్రతి మనిషిని ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.



 కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరూ హెల్త్ గురించి పట్టించుకోకపోవడం అధునాతన జీవనశైలి ఆహారపు అలవాట్లు వెరసి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎంతో మంది శృంగార సమస్యలతో సతమతమవుతున్నారు అన్న విషయం తెలిసిందే.  భాగస్వామితో శృంగారంలో సరిగా పాల్గొనలేక పోవడం వివిధ రకాల సమస్యలు వేధిస్తూ ఉండడం వీర్యకణాల సంఖ్య తగ్గిపోయి ఇబ్బందులు పడుతూ ఉండడం లాంటి సమస్యలు ఈ మధ్యకాలంలో ఎంతోమందిలో తలెత్తుతున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఇలా వీర్యకణాల సంఖ్య తగ్గినప్పుడు మగవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఇలా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది అని నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని ఆహారాలు తినడం వల్ల వీర్యకణాల సమస్యను అధిగమించవచ్చు అని సూచిస్తున్నారు నిపుణులు. మెంతులు తినడం వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్లు పెరుగుతాయి. అంతేకాకుండా డార్క్ చాక్లెట్లు తినడం వల్ల స్పెర్మ్  కౌంట్ పెరిగే అవకాశం కూడా ఉంటుందట. గుడ్లు వెల్లుల్లి పాలకూర లాంటివి కూడా వీర్యకణాల సంఖ్య పెంచడానికి ఉపయోగపడతాయట. అరటి పండ్లు దానిమ్మ పండ్లు సంత్రాలు గుమ్మడికాయ గింజలు ఆలివ్ ఆయిల్ కూడా రెగ్యులర్ గా తీసుకుంటే స్పెర్మ్  కౌంట్ పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: