తమిళ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.. జయలలిత నెచ్చెలి అన్నాడీఎంకే నాయకురాలు శశికళ అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా సంచలన ప్రకటన చేశారు. ఉన్నట్టుండి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన విడుదల చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా.. అన్నాడీఎంకే విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు. ఇంకా మరో వందేళ్లపాటు అన్నాడీఎంకే పాలనే సాగాలని ఆమె ఆకాంక్షించారు. దీని కోసం జయలలిత అభిమానులు, అన్నాడీఎం కే కార్యకర్తలు కృషి చేయాలని
శశికళ తన ప్రకటనలో తెలిపారు.


జయలలిత చెప్పినట్టు అన్నాడీఎంకే ప్రత్యర్థి డీఏంకేనని..  ఆ పార్టీ గద్దె ఎక్కకుండా అడ్డుకోవాలని శశికళ పిలుపు ఇచ్చారు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ కూడా వచ్చిన తర్వాత ఇలాంటి సమయంలో అనూహ్యంగా శశికళ ఏకంగా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటన విడుదల చేయడం అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. సరిగ్గా కొన్ని రోజుల క్రితం రజినీకాంత్‌ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా అంతా గుర్తు చేసుకుంటున్నారు.


అటు రజనీకాంత్‌ గానీ..ఇటు శశికళ కానీ.. తమిళరాజకీయాల్లో సంచలనంగా మారతారని అంతా ఊహించిన వారే.. రజినీకాంత్ తిరుగులేని స్టార్‌ కాగా.. శశికళ జయలలిత తర్వాత పార్టీని అంతగా ప్రభావితం చేసిన నేతగా పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్ కూడా ఇప్పుడు శశికళ షాక్ ఇచ్చినట్టుగానే అనూహ్యంగా షాక్ ఇచ్చారు. పార్టీకి అంతా సిద్ధం అంటూ రెండు, మూడేళ్లుగా ఊరించిన సూపర్ స్టార్‌.. ఉన్నట్టుండి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించారు. ఆయనకు కరోనా సోకడం.. ఆ తర్వాత వైద్యులు ఆరోగ్య రీత్యా ఎక్కువ రిస్క్‌ తీసుకోవద్దని చెప్పడంతో రజనీకాంత్ అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పార్టీ పెట్టకుండానే రాజకీయాల నుంచి విరమించుకున్నారు.

ఇప్పుడు శశికళ కూడా అంతే.. ఆమె బెంగళూరులోని జైలు నుంచి కొన్ని రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే. ఆమె రాక తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే శశికళ జైలు నుంచి తమిళనాడు వచ్చిన తీరు కూడా  సంచలనం సృష్టించింది. ఆమెకు దారిపొడవునా అభిమానులు స్వాగతం పలికారు. ఇక ఆమె రాకతో రాజకీయాలు మరింత ఊపందుకుంటాయన్న సమయంలో ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు అచ్చం రజనీకాంత్‌ తరహాలోనే.

మరింత సమాచారం తెలుసుకోండి: