సాధారణంగా అయితే ప్రతి కాలంలో కూడా ఆ సీజన్లో దొరికే పండ్లను తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వేసవిలో ఎండ ద్వారా వచ్చిన డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి.. వివిధ రకాల సీజనల్ ఫ్రూట్స్ తింటే ఎంతో మంచిది అని నిపుణులు సూచిస్తూ ఉంటారు అయితే నిపుణుల ఎక్కువగా సూచించే ఫ్రూట్స్ లో.. పుచ్చకాయ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇక పుచ్చకాయ తినడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది అని అందరు నమ్ముతూ ఉంటారు
అయితే ఇక చాలామంది వేసవిలో పుచ్చకాయలు కొనుక్కొని తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే పుచ్చకాయ కొనే సమయంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గమనించాలి అని చెబుతున్నారు నిపుణులు. ఇందులో ఆడ మగ జాతులు కూడా ఉంటాయట. ఆడ పుచ్చకాయలో చిన్నగా గుండ్రంగా ఉంటాయట. మగ పుచ్చకాయలు గుడ్డు ఆకారం లో ఉంటాయట. మగ పుచ్చ కాయలో నీటి గుజ్జు శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పుచ్చకాయ ఏ సైజులో ఉన్నా సరే పట్టుకున్నప్పుడు బరువుగా అనిపించే పుచ్చకాయ తీసుకోవడం ఎంతో బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి