అనంతపురం జిల్లా ధర్మవరం పట్టు అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించింది. ఈ జిల్లాలో సుమారు లక్షా 20వేల చేనేత మగ్గాలు ఉండగా సగానికి పైగా ధర్మవరం దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఈ రంగం వేలాదిమందికి ఉపాదిని ఇస్తున్నప్పటకీ పర్యాయణానికి ముప్పుగా మారింది. పట్టుచీరల తయారీలో కీలకమైన రంగుల అద్దకం ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారింది. నిత్యం చేనేత కార్మికులు ఉపయోగిస్తున్న లక్షలాది లీటర్ల రంగునీళ్లతో భూగర్భజలం కలుషీతమవటమే కాక అద్దకానికి ఉపయోగించే రసాయనాలు, యాసిడ్లతో పర్యాయణ సమతుల్యం దెబ్బతింటుంది. ప్రస్తుతం పట్టణంలో ఎక్కడ బోరువేసినా మంచినీళ్లు లభించే పరిస్థితే లేదు. భూమిలోకి ఇంకుతున్న రంగునీళ్లు, రసాయనాలతో భూగర్భజలం కలుషితమై రంగు, రుచి మారిపోయాయి. ఇక్కడి భూగర్భ జలాల్లో కాదిన్యత 600 సిసిఎంల కంటే ఎక్కువగా ఉందని ఇటీవల పరీక్షల్లో తేలింది. కొంతమంది రంగుల అద్దకానికి నిషేదించిన పౌడర్లు, యాసిడ్సు ఇతర ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నారు. వీటివల్ల ఆయా దుస్తులు ధరించే వారికి ఎలర్జీతోపాటు దురదలు కూడా వస్తున్నాయి. వీరు నిషేధిత పెంటా క్లోరోఫినాల్, అరెల్ అమైన్స్, బెర్జిలిన్, ఇథాడ్సి, అనిలిన్, నాప్తల్ ఫైన్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వీటిని పలు దేశాల్లో ఎప్పుడో నిషేధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: