తూర్పు గోదావరి జిల్లా రావులపాలేం మండలంలో కోట్టాది రూపాయల ఆస్తికలిగిన ఓ నగల షాపు యజమానికి ప్రభుత్వాధికారులు ఆరేళ్లక్రితం తెల్లరేషన్ కార్డు ఇచ్చారు. రావులపాలెం మండంలం వెదిరేశ్వరానికి చెందిన పెదపూడి సూర్యనారాయణ, విజయ జ్యూలరి షాపు యజమాని, ఇతనికి మారుతి కారుతోపాటు కోట్టాది రూపాయల విలువైన భవనాలు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. అయినప్పటికీ దారిద్ర్యరేఖకు దిగువనున్న వారికి జారీ చేసే తెల్లరేషన్ కార్డును పొందాడు. ఆరెళ్లుగా రేషన్ డిపొనుంచి క్రమం తప్పకుండా బియ్యం, కిరోసిన్, పామాయిల్, కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకుంటున్నాడు. అంతేకాదు, ఆరోగ్యశ్రీ, పథకం ద్వారా తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆపరేషన్ కూడా చేయించారు. చివరకు గుర్తు తెలియని వ్యక్తుల సమాచారం మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించగా ఈ కోటీశ్వరుడి భాగోతం వెల్లడైంది. దీంతో రెవెన్యూ అధికారులు అతనికి నోటీసులు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ, రేషన్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ నోటీసులు ఇచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: