రాజకీయ నాయకులంతా దేవుళ్లై పోతున్నారు. ఇటీవల మరణించిన శివసేన అధినేత బాల్ థాకరే గుడి కోసం ఆ పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తుండగా, తాజాగా ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ కు కూడా ఆలయం కట్టేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధం అయిపోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా వారు ప్రారంభించారు. దేవుళ్లుగా మారుతున్న రాజకీయ నాయకుల జాబితాలో మరో నేత చేరబోతున్నారు. ఇప్పటికే యూపీలో మాయావతి కి గుడి కట్టి బీఎస్పీ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకోగా, ములాయం సింగ్ గుడి కోసం సమాజ్ వాదీ పార్టీ కూడా సిద్ధం అవుతోంది. సమాజ్ వాదీ అలీగడ్ జిల్లా శాఖ పార్టీ అధ్యక్షునికి గుడి కట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే స్థల సేకరణ పూర్తి చేసిన జిల్లా శాఖ త్వరలో పనులు ప్రారంభించబోతోంది. అయితే దీనిపై ఎస్పీ పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేసినా... త్వరలో ఎలాగైనా గుడి కట్టి తీరాలని వారు యోచిస్తున్నారు. ఇటీవల మరణించిన శివసేన నేత బాల్ థాకరే కూడా ఆ పార్టీ కార్యకర్తలు గుడి కడుతున్నారు. చంద్రాపూర్ జిల్లాలో దీనికి సంబంధించి నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. దివంగత నేత మీద అభిమానం చాటుకునేందుకే థాకరే కు గుడి కడుతున్నామని ఆ పార్టీ కార్యకర్తలు తెలిపారు. యూపీ మాజీ సీఎం మాయావతిపై కూడా బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేతలు ఇలాంటి అభిమానాన్నే చాటుకున్నారు. ఇప్పటికే ఆమెకు యూపీలో ఓ గుడి నిర్మించారు. అంతే కాదు ఆ రాష్ట్రంలో ప్రతి మూలలోనూ మాయావతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అధినేత్రి పై అభిమానాన్ని చాటుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: