ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమో పాన్ కార్డ్ కూడా అంతే ముఖ్యం. ఆధార్ కార్డుకి పాన్ కార్డును లింక్ చేయించుకోమని ఎప్పటినుంచో ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు చివరి తేదిని పొడిగిస్తునే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవడానికి విధించిన చివరి తేదీని ప్రభుత్వం మళ్ళీ పొడిగించింది. ఈ చివరి తేదిని 2021 మార్చి 31వ తేదీగా మార్చింది. నిజానికి ఇలా పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడానికి సంబంధించిన చివరి తేదీని 2020 జూన్ 30 వరకు నిర్ణయించింది. కానీ ఈ తేదీని ఈ నెల చివరి వరకూ అప్పట్లోనే పొడిగించింది.


కనీసం ఇప్పటికి అయిన ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఇప్పుడు పొడిగించిన ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే రూ. 10000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేయకపోతే ఇకపై  భవిష్యత్తులో పాన్ కార్డు అవసరమయ్యే దగ్గర ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉండవని అంటున్నారు. అంతేకాకుండా బ్యాంకు ట్రాన్సాక్షన్ లో పాన్ కార్డు అవసరం చాలా ఉంటుంది. ఈ పాన్ కార్డు అనేది ఖాతా ఓపెన్ చేయడానికి గానీ, పరిమితికి మించి డబ్బు జమ చేయాలన్నా, తీసుకోవాలన్నా పాన్ కార్డ్ చాలా అవసరం.


పాన్ కార్డు లేకపోతే బ్యాంకు సర్వీస్ లు ఏవి కూడా జరగవు. అసలు చాలామందికి తమ ఆధార్ లింక్ అయిందో లేదో అనే విషయం కూడా తెలియదు. అలాంటివారు  ఆధార్ తో లింక్ చేసారా..? లేదా అని తెలుసుకోవడానికి ఈ క్రింది  వెబ్ సైట్ www.incometaxindiaefiling.gov.in లోకి లాగిన్ అయితే తెలిసిపోతుంది. ఒకవేళ లింక్ కాకపోతే లాగిన్ అయ్యాక మీ పాన్ కార్డుతో ఆధార్ లింక్ అవ్వలేదని  తెలిస్తే, అక్కడ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫార్మ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. దానిలో ఉన్న వివరాలన్నింటినీ తప్పకుండా తప్పులు లేకుండా ఫిల్ చేయండి. అన్ని పూర్తి చేసాక సబ్మిట్ కొడితే  పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిపోయినట్లే.. ఆలస్యం చేయకుండా త్వరగా పాన్ కార్డు కు ఆధార్ లింక్ చేసుకోండి. లేదంటే జరిమాన కట్టక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: