మాములుగా రాజకీయాలలో ప్రతీకార పూరితంగా వ్యవహరించడం సహజమే. అయితే కొన్ని సార్లు ప్రతీకారం కోసం చేసే రాజకీయం మనకు ఉపయోగపడకపోగా, కొన్ని సందర్భాలలో మనకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. రాజకీయంగా వేరొకరిని అణగదొక్కాలనే ఉద్దేశ్యంతో వారిని వెంటాడి వారిపై కేసులు పెట్టినా, అవతలి వారిని బలహీనపరచకపోగా...పరోక్షంగా వారిని బలవంతులను చేయడమే అవుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే...కేంద్రంలో గత సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు. ఎలాగంటే నరేంద్ర మోదీని ఎలాగైనా అణిచివేసి జైల్లో పెట్టి, ఆర్ఎస్ఎస్ ను ఇండియాలో లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నో వ్యూహాలను పన్నింది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో చిదంబరం ప్రముఖ పాత్ర వహించారు.

సోనియా గాంధీ మనసులో ఉన్న విషయాన్ని ఆచరణలో పెట్టి, అందులో భాగంగానే ఒక సాధ్వి ప్రాచీ అరెస్ట్ దగ్గరనుండి మొదలయింది. ఆ తరువాత కల్నల్ పురోహిత్ ని అడ్డం పెట్టుకుని హిందూ తీవ్రవాదం అనే పదాన్ని హైలైట్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీనికి ప్రతీకారంగానే ఆరెస్సెస్ ఒక బలమైన నాయకుడిని ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో ముందుకు తీసుకు వచ్చింది. ఈయన దెబ్బతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రా కేసులో బెయిల్ మీద ఉన్నారు. అయితే ఇదే విధంగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రతీకారంగా వ్యహరిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు..కాంగ్రెస్ లోని చిదంబరం మరియు సోనియా గాంధీలతో కలిసి తనను అరెస్ట్ చేయించారనే కసితో ఉన్నాడు.

దానితో ఇప్పుడు చంద్రబాబును  మరియు లోకేష్ లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇలా చేయడం వలన చంద్రబాబుకు ప్రజల్లో సానుభూతి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది టీడీపీ ముఖ్య నాయకులను కేసుల పేరుతో అరెస్టులు చేయడం జరిగింది. మిగతా నాయకులు కావొచ్చు అరెస్ట్ అయిన వాళ్ళు కావొచ్చు పార్టీని వీడడం లేదు. ఎందుకంటే ఇలాంటి కేసుల నుండి బయటపడాలంటే న్యాయపరంగా అన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు తోనే కొనసాగాలి. మరి జగన్ అనుకున్నట్లు చేయగలుగుతాడా...? లేదా తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: