కరోనా ఎంతగా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దేశం లో ప్రజలు ఉంటారా అనే సందేహాలు అందరికి మొదలవుతున్నాయి.. రోజు రోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ వస్తే.. అంతే మరణాల రేటు కూడా నమోదవుతున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. అనుమానంతో టెస్ట్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో భయం తో చాలా మంది చనిపోతుంటే.. మరి కొందరు ప్రభుత్వం చేతకాని తనం వల్ల ప్రాణాలను వదిలేస్తున్నారు.

కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రుల వసతులు సరిపోలేదు.. ఉన్నా దేశంలో ఆక్సిజన్ కొరత.. ఇక మనుషులు ఎలా బ్రతుకుతారు.. పాజిటివ్ వచ్చిన అతి కొద్దీ రోజుల్లోనే మరణిస్తుండటం బాధాకరం.. ఇప్పటికే ఎన్నో లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి మిత్ర దేశాల సాయం కోరారు. కానీ, తన పంజా విసరడం నిజంగా దయనీయం..

ఇప్పుడు జరిగిన ఓ ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. కళ్ళు కూడా పూర్తిగా తెరవని ఓ పసికందు పై కరోనా పాశవికాన్ని వదిలింది. వివరాల్లోకి వెళితే.. ప్రసవానికి ముందు తల్లి కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకు వ్యాధి సోకింది. 8 రోజుల శిశువుకు కూడా వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శిశువు ఇప్పుడు కోవిడ్  కోసం ప్రతికూలత ను పరీక్షించింది, మేము 15 రోజుల చికిత్స తర్వాత నవజాత శిశువును విడుదల చేసాము, ”అని డాక్టర్ చెప్పారు.. ప్రస్తుతం ఆ పసికందు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇటీవల సంవత్సరం పాప కరోనా తో చనిపోయిన సంగతి తెలిసిందే.. ఆ సంఘటన మరువక  ముందే ఇలాంటి ఘటన ఎదురవ్వడం బాధాకరం అని చెప్పాలో.. ప్రభుత్వాల అసమర్థత అని చెప్పాలో తెలియడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: