దేశం లో రోజు రోజుకు కరోనా వైరస్ శరవేగం గా పెరిగిపోతుంది. ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. వెరసి రోజు రోజుకు దేశం లో పరిస్థితులు మరింత అధ్వానం గా మారి పోతున్నాయి. మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవ రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యం లో ప్రస్తుత ప్రజలందరూ బెంబేలెత్తి పోతున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది.


 ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడం లో పూర్తిగా విఫలమవు తున్నాయి. అయితే ఇటీవలే  వైరస్ కేసులు సంఖ్య కాస్త తగ్గినట్టు అని పించినప్పటికీ మరో సారి కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  ముఖ్యంగా తమిళనాడు లో ఇటీవలే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ అనంతరం ఎంతో మంది పార్టీల కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు. అయితే ఇక ఈ సంబరాలు పుణ్యమా అని అటు చెన్నై లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.



 అదే సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల కూడా రోజు రోజుకు మరింత ప్రమాద కరంగా మారిపోతుంది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.  అయితే ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ కేసులు హాట్ స్పాట్ గా మారి పోయిన మహారాష్ట్ర లో మాత్రం క్రమక్రమంగా  కేసుల సంఖ్య తగ్గిపోతోంది. అంతే కాకుండా రికవరీ రేటు కూడా పెరిగిపోతుంది అన్నది కేంద్రం గుర్తించినట్లు తెలిసింది. దాదాపుగా 12 రాష్ట్రాల లో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక లక్ష వరకు ఉంది అనే విషయాన్ని కేంద్రం ఇటీవలే తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: