కరోనా నుండి కోలుకున్న కొద్దిరోజుల తర్వాత వందల మంది జనాలు పలురకాల వ్యాధుల తో హాస్పిటల్ లో చేరుతున్నారు. ఎవరైతే స్టెరాయిడ్స్ ఎక్కువగా వినియోగించి ఉంటారో వారిలోనే ఈ సమస్య లు తలెత్తుతున్నట్లు సమాచారం. తద్వారా కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, ఫంగల్ వ్యాధులు సంక్రమించినప్పుడు భరించలేని స్థితికి శరీరం చేరుకుంటుంది. థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధులు ప్రమాదకరంగా మారుతున్నాయి. కానీ డాక్టర్లు మాత్రం కరోనా నుండి కాపాడేందుకు స్టెరాయిడ్స్ తప్ప మరో ఆప్షన్ లేదని, అయితే వీటిని సక్రమంగా వినియోగించినట్లయితే ఎటువంటి సమస్యలు ఉండబోవని, వాడే విధానం సరిగా లేనప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.
ఈ అంశంపై మాట్లాడిన ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కూడా స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం వలనే ఇలాంటి ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని అంటున్నారు. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడానికి స్టెరాయిడ్స్ ని మిస్ యూజ్ చేయడం కూడా ప్రధానమైన అంశమే అంటున్నారు. ఇతర దేశాలలో కూడా కరోనా వైరస్ ఉంది. అయినప్పటికీ అక్కడ పెరగని బ్లాక్ ఫంగస్ కేసులు మన ఇండియాలో భారీగా నమోదవుతున్నాయి. దీనికి కారణం స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటమే అంటున్నారు. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి