ఇటీవలే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గా ఎన్నికైన జస్టిస్ ఎన్వి రమణ..  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనామిలీస్ ఇన్ లా అండ్ జస్టిస్ అనే పుస్తకాన్ని ఇటీవలే మాజీ జస్టిస్ రవీంద్రన్ రాశారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు సీజేఐ ఎన్.వి.రమణ . ఇక జస్టిస్ రవీంద్రన్ రాసిన పుస్తకంలోని ప్రతి వాక్యం కూడా ఎంతో గొప్పగా ఉంది అంటూ పంపించారు జస్టిస్ ఎన్వి రమణ.  న్యాయ స్థానాలపై సామాన్యులకు మరింత నమ్మకం పెరిగే విధంగా ఇక ఈ పుస్తకాన్ని జస్టిస్ రవీంద్రన్ అద్భుతంగా  రాసారు అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా న్యాయ స్థానంలో ఉన్న కొన్ని లోపాలను సరి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.



 ఇక ప్రజా విశ్వాసం కోసమే ప్రతి ఒక్క న్యాయస్థానం పని చేయాలి అంటూ పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఇక సామాన్యులకు న్యాయస్థానాలు న్యాయాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ తమ పూర్తి స్థాయి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవలే మాజీ జస్టిస్ రవీంద్రన్ రాసిన పుస్తకంలో  ప్రతి లైన్ కూడా న్యాయ స్థానాలపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచే లాగ ఉన్నాయి అంటూ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే మాజీ జస్టిస్ రవీంద్రన్ న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా.. ఇక ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయడం.. దీనికోసం  ప్రత్యేకమైన పుస్తకం రాయడం ఎంతో హర్షించదగ్గ విషయం అంటూ కితాబిచ్చారు.



 సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను బాధ్యతలు చేపట్టిన రోజు మాజీ జస్టిస్ రవీంద్రన్ రాసిన లేఖను చదివాను అంటూ గుర్తు చేసుకున్నారు సీజేఐ ఎన్.వి.రమణ. ఈ లేఖలో మాజీ జస్టిస్ రవీంద్రన్ ప్రస్తావించిన ప్రతి అంశం కూడా తాను ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక జస్టిస్ రవీంద్రన్ మరిన్ని రోజులపాటు ఇలా ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. మాజీ జస్టిస్ రవీంద్ర రాసిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలని సూచించారు. ఈ పుస్తకం చదవడం వల్ల ప్రజలకు న్యాయ స్థానాలపై మరింత నమ్మకం వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cji