ప్రస్తుతం తెలంగాణ ప్రజానీకం చూపు మొత్తం హుజూరాబాద్ నియోజకవర్గం ఫైనే ఉంది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా రానే లేదు.. కానీ అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది  ముఖ్యంగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రిగా టీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ ను వదిలిన ఈటెల బీజేపీలో చేరడం ఆ తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం అంటూ సవాల్ విసరడం గా మరింత సంచలనంగా మారింది.


 ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక అటు టీఆర్ఎస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలోనే ఇక ఎన్నో పథకాలు ఎన్నో నిధులు అంటూ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ తమవైపు తిప్పుకునేందుకు కెసిఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.  అదే సమయంలో అటు ఈటెల రాజేందర్ పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజలందరినీ కలుస్తూ ఉండటం కూడా హాట్ టాపిక్ గా మారింది. హుజురాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం చూపులు మొత్తం ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుతం ఈటల రాజేందర్ పాదయాత్ర పేరుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కలియతిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటుండటంతో కీలక పరిణామం చోటు చేసుకుంది  పాదయాత్రలో ఉన్న ఈటెల రాజేందర్ ను మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జితేందర్ రెడ్డిలు కలవడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.


 ఇటీవలే ఈటెల రాజేందర్ పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో గూడూరు వద్ద ఈ ముగ్గురు భేటీ అయ్యారు. కార్ లో అరగంటపాటు రహస్యంగా మంతనాలు జరపడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎంతో చర్చనీయాంశంగా మారిపోయింది. మరికొన్ని రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఇక ఈ ఇద్దరు ఏకంగా ఈటల రాజేందర్ తో ఎందుకు సమావేశం అయ్యారు అనేది హాట్ టాపిక్ గా మారింది. కెసిఆర్ను ఓడించేందుకు అందరూ ఒకే వేదికపై వచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయని ఈ సమావేశం పై జితేందర్ రెడ్డి కొంత స్పష్టత నిచ్చారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: