ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడుల అంశం మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఈ అంశంపై తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. ఏపీలో దళితుల్ని లక్ష్యంగా ఎంచుకొని మత మార్పిళ్లకు పాల్పడుతున్నారంటూ నాగరాజు అనే వ్యక్తి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కమిషన్ నుంచి చీఫ్ సెక్రటరీకి తాఖీదులు అందాయి. రెండువారాల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. అలా జరగని పక్షంలో రాజ్యాంగంలోని 338 ఆర్టికల్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఎంపీ రఘురామ ఫిర్యాదు
ఏపీలో మతమార్పిడులను రాష్ట్ర ప్రభుత్వమే చేయిస్తోందంటూ ప్రతిపక్షాలు గతం నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. దీనిపై ఆ పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థలు కూడా రాష్ట్రపతి వరకు ఈ విషయాన్ని తీసుకువెళ్లాయి. క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్లలో జరుగుతున్న దుర్వినియోగం, జానాభా లెక్కలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ పలు అంశాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ సామాజిక న్యాయశాఖకు పంపించింది. దీనిపై విచారణ జరపాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిని రాష్ట్రపతి గతంలోనే ఆదేశించారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి సమాచారం పంపించలేదని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు కూడా మతమార్పిడులు చేయిస్తున్నారు?
మతమార్పిడులకు తోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాస్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించి ఇప్పటికే కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కు సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో ఉండగా ఇటీవలే వాటిని తొలగించారు. కరకట్ట కమలహాసన్‌గా పిలవబడే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాస్టర్లతో సమావేశం నిర్వహింపచేసి.. మీరు మతాలు మార్చండి.. ఎవరు అడ్డొస్తారో చూస్తా అన్నట్లు భరోసా ఇచ్చారనే వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆళ్లతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేల వీడియోలు కూడా బయటకు వచ్చాయి. జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించినా, రాష్ట్రపతి ఆదేశించినా ప్రభుత్వం ఇంతవరకు నివేదిక పంపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ నివేదిక పంపించినా మతమార్పిళ్లు లేవంటూ నివేదిక పంపుతోంది. ఎవరైనా ఏ విషయంలోనైనా పట్టుబడకుండా ఉంటే.. వేరేవారెవరైనా వచ్చి అదెవరు చేశారు? అని ప్రశ్నిస్తే ఆ చేసినవారు ఏం చెబుతారు? తమకేమీ తెలియదంటారు. ఏపీ ప్రభుత్వం కూడా అలాగే చెబుతోంది..!!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి