అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఏకంగా ఈ సారి 16 మంది ఐఏఎస్ లకు స్థాన చలనం చోటు చేసుకుంది. వివిధ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, కర్నూలు, కడప జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగించింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఇక కలెక్టర్ల బదిలీల వివరాల్లోకి వెళితే.. విజయనగరం కలెక్టర్ గా సూర్య కుమారిని నియమించగా... విశాఖ కలెక్టరుగా మల్లిఖార్జున్ నియామకం అయ్యారు.

తూ.గో కలెక్టర్ గా హరి కిరణ్ నియామకం కాగా... కర్నూలు కలెక్టరుగా కోటేశ్వరరావును నియామకం అయ్యారు. అలాగే కడప కలెక్టర్ గా విజయ రామ రాజు ను నియమించిన ఏపీ సర్కార్.. APMSIDC ఎండీగా మురళీధర్ రెడ్డిను ఎంపిక చేసింది. అంతేకాదు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓగా వాడ్రేవు వినయ్ చంద్ ను నియమించింది ఏపీ సర్కార్. ఆర్ అండ్ ఆర్ కమిషనరుగా హరి జవహర్ లాల్ ను నియమించగా.. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీగా వీరపాండియన్ ను నియామకం చేసింది సర్కార్.

వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనరుగా వెంకట రమణా రెడ్డిను నియమించగా.. ప.గో జేసీ(ఆర్బీ అండ్ ఆర్)గా సుమిత్ కుమార్ ను నియమించింది. ఇక శ్రీకాకుళం జేసీ(ఆర్బీ అండ్ ఆర్)గా బిఆర్ అంబేద్కర్ ను నియమించగా... చిత్తూరు జేసీ(ఆర్బీ అండ్ ఆర్)గా స్వప్నిల్ దినకర్ ను నియమించింది ఏపీ ప్రభుత్వం. అలాగే  శాప్ ఎండీగా ఎం ప్రభాకర్ రెడ్డి నియామకం కాగా... హ్యాండ్లూమ్స్ అండ్ టెక్సైటైల్స్ డైరెక్టరుగా అర్జున రావు నియామకం అయ్యారు. ఇక దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహనుకు ఆ శాఖ కమిషనర్ కు  అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.ఈ మేరకు ఆంధ్ర ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.








మరింత సమాచారం తెలుసుకోండి: