మాట తప్పను మడమ తిప్పను అనే నినాదంతో ఏపీలో అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.  అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని పథకాలు ప్రవేశ పెట్టడమే కాదు ఆయా పథకాల ద్వారా భారీగా ఆర్థిక సహాయం చేసేందుకు కూడా సిద్ధమైంది జగన్ ప్రభుత్వం. ఇలా జగన్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా అటు అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి చెందారు అని చెప్పాలి.



 కానీ ఎన్నికల ముందు ఇచ్చిన కొన్ని హామీలను మాత్రం సీఎం జగన్ ఇప్పటివరకు నెరవేర్చ లేకపోయారు.  ప్రస్తుతం సీఎం జగన్ నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలీసులు నిరంతరం శ్రమించాలా.. వాళ్ళు కూడా మనుషులే వాళ్లకి కూడా సెలవులు ఉండాలి తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికీ వారాంతపు సెలవులు ఇస్తాము అంటూ జగన్ అప్పట్లో చెప్పారు  ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని అమలులోకి తెస్తారు అని అనుకున్నారు అందరు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఊసేలేదు.  ఇక జగన్ చెప్పిన హామీ అమలు చేయాలంటే కొంతమంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలి.. దీని కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలి. కానీ మొన్న విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ తోనే ఇక ఉద్యోగాల భర్తీపై జగన్ వైఖరి అర్థం అయింది.



 అయితే జగన్ కు సన్నిహితుడైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మాత్రం  చెప్పింది చేసి చూపించారు.  ఇటీవలే పోలీసులు అందరికీ కూడా వారాంతపు సెలవులు ఇస్తూ ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఎంకే స్టాలిన్ . ఇక ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు సందర్భంలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించింది ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం. దీనికి సంబంధించి అదనపు సిబ్బంది నియామకానికి కూడా చర్యలు తీసుకుంటాం అంటూ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: