అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు జీవితాన్ని అయోమయంలో పడేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు జీవితాన్ని అక్కడితోనే ఆపేస్తూ ఉంటాయి కొన్ని ఘటనలు. ఎన్నో  ఇలాంటి సంఘటనలు సంతోషంగా సాగిపోతున్న వారి కుటుంబాల్లో  అరణ్యరోదన మిగుల్చుతు ఉంటాయి. ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతివేగం అజాగ్రత్తగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. తల్లిదండ్రులు బయటికి వెళ్ళద్దు అంటూ ఎంత వారించినా వినకుండా బయటకు వెళ్లిన ఇద్దరు ప్రాణ స్నేహితులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది



 వివరాల్లోకి వెళితే... ధర్మపురి మండలం బూరుగుపల్లి కు చెందిన సాంబయ్య తిరుపతమ్మ దంపతులకు అక్షయ అనే కుమారుడు ఉన్నాడు. లచ్చయ్య పద్మ దంపతులకు అంజి అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇటీవలే  మంచిర్యాలకు చెందిన ఓ స్నేహితుడు తన ఆటో ని అక్షయ్ ఇంటి వద్ద ఉంచి వెళ్లాడు. దీంతో వారం రోజుల నుంచి అదే ఆటోలో తిరుగుతూ ఆటోడ్రైవింగ్ నేర్చుకున్నాడు అక్షయ్. ఈ క్రమంలోనే  ఆదివారం రోజున రాత్రి సమయంలో తన ప్రాణ స్నేహితుడైన అంజి తో కలిసి ఆటోలో ధర్మపురికి వెళ్లేందుకు బయలుదేరారు.



 ఇక ఆదివారం అమావాస్య..  సాధారణంగా తల్లిదండ్రులు  పిల్లలను రాత్రి సమయంలో బయటకు పంపించరూ. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు వీరిద్దరినీ కూడా బయటకు వెళ్లడం వద్దు అంటూ చెప్పారు. కానీ తల్లిదండ్రుల మాట వినకుండా ధర్మపురి కి వెళ్లి వస్తాము అంటూ ఇద్దరు యువకులు బయలుదేరారు. వెళ్లేటప్పుడు ఎంతో సాఫీగానే వెళ్లిన ఇద్దరిని తిరుగు ప్రయాణం లో మాత్రం అనుకోని విధంగా మృత్యువు కబలించింది. ఆర్టీసీ బస్సు ఆటోని ఢీ కొట్టింది.   ఆటో ఏకంగా మూడు పల్టీలు కొట్టింది. దీంతో ఆటో లో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే  వదిలారు. ఇక ఘటనా స్థలికి చేరుకున్న తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: