ఈ మధ్యనే ఇండియా టుడే పత్రిక నిర్వహించిన ది బెస్ట్ సీఎం సర్వేలో నాలుగవ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు తమిళనాడు సీఎం స్టాలిన్. ఈ మధ్యనే తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయధుందుభి మోగించింది. ఆ పార్టీ నాయకుడైన స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం అయిన నాటి నుండి అత్యుత్తమ నిర్ణయాలతో తమిళనాడులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజలు సైతం స్టాలిన్ పాలనపై సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు మరో ఆశ్చర్యకర నిర్ణయంతో వార్తల్లో నిలిచాడు. స్టాలిన్ తాటి చెట్లను పెంచే విషయంలో ఆసక్తిగా ఉన్నాడు. ఇందులో భాగంగానే మొన్న జరిగిన అసెంబ్లీ సభలలో స్పీకర్ అప్పావు ఏడాదికి లక్షల తాటి విత్తనాలను సరఫరా చేస్తామని ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వారు అదేంటి తాటి చెట్టు పెంపకం అంటూ నోరెళ్ళబెడుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రముఖులలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి కొన్ని చిహ్నాలు ఉండడం పరిపాటి. అదే విధంగా తమిళనాడు రాష్ట్రానికి రాష్ట్ర చెట్టుగా తాటి చెట్టును ప్రకటించనున్నారు. ఇదే విధంగా కంబోడియా అనే దేశం సైతం తాటి చెట్టును జాతీయ చెట్టుగా గుర్తించింది.

కానీ అంతగా ఈ తాటి చెట్టులో ఏముందో చాలా మందికి తెలిసి ఉండే అవకాశం లేదు. ఇప్పుడు తమిళనాడులో తాటి చెట్లను పెద్ద ఎత్తున సాగు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లుగా స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు తాటి చెట్ల విషయంలో ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలులేదు. ఒకవేళ తాటి చెట్టును ఎవ్వరైనా నరకాలు అనుకుంటే సంబంధిత జిల్లా కలెక్టర్ అనుమతి తప్పక తీసుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెద్ద పెద్ద సునామీలు ప్రకృతి వైపరీత్యాల వచ్చినప్పుడు కూడా ఈ తాటి చెట్లు ఎంతో దృఢంగా నిలబడగలుగుతున్నాయి. అటువంటి చెట్లను కాపాడుకోవడం ...ఎక్కువ సంఖ్యలో సాగుచేసుకోవడం మన బాధ్యత అని గొప్పగా చెప్పారు. అంతే కాకుండా ఈ తాటి చెట్ల నుండి మనము ఎన్నో విధాలుగా ఉపయోగాలు పొందుతున్నాము. ముఖ్యంగా ఈ తాటి చెట్ల నుండి వచ్చే తాటి బెల్లం మరియు తాటి కల్లు వంటివి ఆరోగ్యపరంగా మంచివని చెబుతున్నారు. అంతే కాకుండా లక్షల మంది ఈ తాటి చెట్లనే నమ్ముకుని ఉపాధి మార్గంగా చూసుకుంటున్నారు.

తాటి చెట్లు నుండి వచ్చే ఊట వలన బీరును తయారుచేసి శ్రీలంక తమ దేశంలో వాడుకోవడంతో పాటు, మిగిలిన దానిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ తాటి చెట్ల నుండి తయారుచేసే బీరుకు విదేశాల్లో డిమాండ్ మామూలుగా లేదు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉండడంతో అన్ని విషయాలను సమగ్రంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంవత్సరానికి ఒక తాటి చెట్టు నుండి దాదాపు 10 వేల రూపాయలు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.  ఇక తాటి కల్లు ద్వారా నెలకు 1000 రూపాయలు, అలాగే ఒక తాటి చెట్టు నుండి వచ్చే 40 కిలోల బెల్లం ద్వారా తగినంత సంపాదన వస్తుందని తెలిపారు.  ఈ తాటి చెట్టు ఎటువంటి ప్రతికూల వాతావరణంలో అయినా పెరుగుతుంది మరియు ఈ చెట్టు 120 సంవత్సరాల వరకు సజీవంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు దీని నుండి పుష్కలంగా ఇన్ని రకాలుగా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ తాటి కల్లును ఆల్కహాల్ కు బదులుగా వాడేందుకు వెసులుబాటు ఉంటుంది. దీని వలన ఈ కాలంలో యువకులు మత్తు పదార్థాలను వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ విధంగా అయినా కొంతమేర మత్తు పదార్థాల బారి నుండి కాపాడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: