గాంధీకి 13వ సంవత్సరంలోనే పెళ్లయింది. కస్తూర్బా గాంధీతో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచే కస్తూర్బా గాంధీ.. భర్త నడిచిన బాటలోనే పయనించారు. స్వాతంత్ర్య పోరాటంలో సైతం.. ఆయన చూపిన దారిలోనే నడిచారు. స్వాతంత్ర్య పోరాటంలో శాంతి మంత్రాన్ని జపించారు. ఆ పోరాటంలో ఆరు సార్లు జైలుకెళ్లారు. అంతేకాదు ఏకంగా 18మాసాలు పుణెలోని అగాఖాన్ ప్యాలెస్ లో బంధీ అయ్యారు. అదే భవనంలో 1944వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన కన్నుమూశారు.

ఇక గాంధీ జీవిత చరమాంకంలో ఆయన వెన్నంటే ఉండి సపర్యలు చేసింది అభా గాంధీ. ఈమె ఎవరో కాదు గాంధీ మునిమనుమడు కను గాంధీ సతీమణి. గాంధీ ఎక్కడికి వెళ్లినా అభా గాంధీ సహాయం ఉండేది. అభా గాంధీ.. మహాత్ముని ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. అంతేకాదు పాటలు కూడా పాడేవారు.  గాడ్సే చేతిలో గాంధీ ప్రాణాలు కోల్పోయే వరకు  అభా గాంధీ ఆయన వెన్నెంటే నడిచారు. ఇక మునిమడు కను గాంధీ ఫోటోలు తీసేవారు.  

ఇక గాంధీజీ జీవితచరమాంకంలో ఆయన దగ్గర ఉన్న వారిలో మనుగాంధీ ఒకరు. ఈమె గాంధీకి బంధువు. చిన్న వయసునుండే మహత్ముని దగ్గర పెరిగారు. ఆమెను తన మనుమరాలిగా ఎంతో ఆప్యాయంగా చూసునేవారు గాంధీ. ఇలా అభా గాంధీ, మను గాంధీల సహాయం తీసునే వారు గాంధీజీ. ఇద్దరి భుజాలపై చేయి వేసుకొని నడిచేవారు. మరోవైపు కస్తూర్బాకు సైతం సేవలు అందించిన వారిలో మను పాత్ర కూడా ఉంది.

ఇక గాంధీ అనుచరుల్లో సుశీల కూడా ఒకరు. ఈమె ఎవరో కాదు మహాత్ముని వ్యక్తిగత కార్యదర్శి ప్యాలేలాల్ సోదరి. గాంధీ సిద్దాంతాలకు మెచ్చి ఆయన్ను అనుసరించారు. అంతేకాదు గాంధీ పర్సనల్ డాక్టర్ గానూ వ్యవహరించారు. గాంధీ తన వృద్ధాప్య జీవితంలో మను, అభా, సుశీల ఈ ముగ్గురు మహిళలు ఎక్కువగా ఆయనకు సేవలందించారు. అంతేకాదు సుశీల స్వాతంత్ర్య ఉద్యమంలో కస్తూర్బాతో పాటు అరెస్ట్ అయిన వారిలో సుశీల కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: