ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వైయస్ షర్మిల.  ఈ క్రమంలోనే వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ముందుకు సాగుతుంది. ఇక ఇప్పుడు తన పార్టీని బలోపేతం చేసుకోవడమే కాదు ప్రజల్లో ఆదరణ పొందేందుకు కూడా వైయస్ షర్మిల ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పాలి.  వరుసగా ధర్నాలు నిరసనలు చేపడుతూ ప్రజల తరఫున నిలబడతాను అంటూ అందరిలో నమ్మకం కలిగిస్తుంది.  అంతేకాకుండా ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తెరమీదికి తెస్తూ నిరసనలు సైతం చేస్తుంది వైయస్ షర్మిల.


 అయితే తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైయస్ షర్మిల అటు సీఎం కేసీఆర్ వదిలిన బాణం అన్న ఒక టాక్ కూడా మొదటి నుంచీ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. కానీ షర్మిల మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇప్పటివరకు ఎన్నో సార్లు విమర్శలు గుప్పించారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం అయింది అంటూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇక ఇటీవలే చేవెళ్లలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర ప్రారంభించారు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన వైయస్ షర్మిల కెసిఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.



 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ కెసిఆర్ చెప్పిన బంగారు తెలంగాణ రాలేదు కానీ బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణ గా మాత్రం మార్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు వైయస్ షర్మిల. రాష్ట్రంలో రోజురోజుకీ మహిళలపై దాడులు పెరుగుతున్నాయి అంటూ వ్యాఖ్యానించారు. కనీసం ఆరేళ్ళ చిన్నారి మాణ, ప్రాణాలకు కూడా రాష్ట్రంలో రక్షణ లేదు అంటూ వ్యాఖ్యానించిన వైయస్ షర్మిల దీనికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ ఉరివేసుకుని చచ్చిపోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ys