ఏపీ సీఎం జగన్‌ను బోస్‌డీకే అంటూ దుర్భాషలాడిన టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు.  ఇవాళ ఉదయం నుంచి పట్టాభి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆయన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేస్తారని అంతా ఊహించారు. అంతా ఊహించినట్టే పట్టాభిని అరెస్టు చేశారు. అయితే.. మధ్యాహ్నం నుంచి పట్టాభి ఇంటి వద్ద ఉన్న పోలీసులు రాత్రి 9గంటలకు అరెస్టు చేశారు. కాలింగ్‌ బెల్‌ నొక్కి పిలిచినా తలుపు తీయకపోవడంతో.. ఏకంగా తలుపులు పగులగొట్టి మరీ పట్టాభిని అరెస్టు చేశారు పోలీసులు.


తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు పట్టాభిని అరెస్టు చేశారు. పట్టాభి కాలింగ్‌ బెల్‌ కొట్టినా తలుపు తీయలేదని పోలీసులు చెప్పారు. అందుకే బలవంతంగా అరెస్టు చేయాల్సి వచ్చిందన్నారు. తలుపు పగులగొట్టి ఇంట్లోకి వచ్చి తీసుకెళ్లడం సరికాదని పట్టాభి భార్య ప్రశ్నించారు. నోటీసు ఇచ్చిన వెంటనే తన భర్తను అరెస్టు చేశారని ఆమె వివరించారు. 120-బి సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారని పట్టాభి భార్య చెప్పారు. తాము ఎఫ్‌ఐఆర్‌ కావాలని అడిగితే తర్వాత ఇస్తామని పోలీసులు చెప్పారని పట్టాభి భార్య చెప్పారు.


పట్టాభి అరెస్టుపై టీడీపీ నేత నారా లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రజ‌ల్ని ర‌క్షించే పోలీసులైతే ప‌ట్టాభిపై దాడి చేసిన వారిని ముందు అరెస్ట్ చేయాలన్నారు. దాడికి గురైన ప‌ట్టాభినే అరెస్ట్ చేశారంటే.. వీళ్లు ప్రజ‌ల కోసం ప‌నిచేసే పోలీసులు కాద‌ని తేలిపోయిందని విమర్శించారు. ఏపీలో ప్రజ‌ల‌కీ, ప్రతిప‌క్షనేత‌ల‌కీ ర‌క్షణ లేదన్న నారా లోకేశ్.. ప‌ట్టాభికి హాని త‌ల‌పెట్టాల‌ని పోలీసులు చూస్తున్నారని ఆరోపించారు. ప‌ట్టాభికి ఏమైనా జ‌రిగితే డిజిపి, ముఖ్యమంత్రిదే బాధ్యత‌న్న లోకేశ్‌..  త‌క్షణ‌మే ప‌ట్టాభిని కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చాలని డిమాండ్ చేశారు.


పట్టాభి బోస్‌డీకే అనేది రాజ‌ద్రోహమైతే.. వైసీపీ నేత‌ల అస‌భ్య భాష ఏ ద్రోహం కింద‌కి వ‌స్తుందో చెప్పాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ గుట్టుర‌ట్టు చేస్తున్నార‌నే ప‌ట్టాభిని అదుపులోకి తీసుకున్నార‌ని ప్రజ‌ల‌కీ అర్థమైందన్న లోకేశ్.. ఎన్నిదాడులు చేసినా ఎందరిని అరెస్ట్ చేసినా.. దేశానికే ముప్పుగా తెలుగుదేశం పోరాటం ఆపదని లోకేశ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: