ఇటీవలి కాలంలో ఇలా ఎంతో మంది సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసి మోసపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.. ఇక సూటిగా చెప్పుకోవాలి అంటే మీకు తెలిసిన ఎవరో ఒకరు కూడా ఇలా సెకండ్ హ్యాండ్ లో కారు కొనుగోలు చేసి మోసపోయిన వారు దాదాపుగా ఉండి ఉండొచ్చు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు కొనడం తప్పేమీ కాదు కానీ ఇలా పాత కారు కొనుగోలు చేయాలి అనుకునే ముందు మాత్రం కొన్ని రకాల విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అవగాహన లేకుండా కొనుక్కుంటే మాత్రం నిండ మునిగి పోవాల్సిందే .
పాత కార్లు కొనుగోలు చేస్తున్నప్పుడు కార్ కండిషన్ ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు అందుకే కొన్ని విషయాలను చెక్ చేయాలి. ముందుగా మీ బడ్జెట్ ప్రకారమే కారు ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ లోన్ తీసుకుంటే వడ్డీ ఈఎంఐ తదితర విషయాలను కూడా గమనించాలి. ఇక ఒకే చోట కాకుండా వేరు వేరు ప్రాంతాలలో కూడా ఇలా పాత కార్లను పరిశీలించిన తర్వాత కారు కొనుగోలు చేయాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంతే కాదు మీరు కొనుగోలు చేయాలనుకునే కారూ మీ అవసరాలకు తగ్గట్లుగా ఉండేలా వెతికిచూడండి. అంతేకాదు కార్ తయారైన సంవత్సరం ఇక ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అన్నది కూడా కారు కొనే ముందు చెక్ చేయడం బెటర్. ఇక కారుపై ఏమైనా గీతలు ఉన్నాయా ఏమైనా డ్యామేజ్ వుందా అన్నది కూడా ముందుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి