ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో దూకుడైన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటినుంచి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించిన నాయకులలో రేవంత్ రెడ్డి  ఒకరు అని చెప్పాలి. పార్టీతో సంబంధం లేదు రాజకీయ నాయకుడికి కంటెంట్ ఉంటే చాలు అని నిరూపించాడు. ఒకప్పుడు టిడిపి పార్టీలో ఉన్నప్పుడు అదే దూకుడుతో ఉన్న రేవంత్ రెడ్డి ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అంతకు మించి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు రేవంత్ రెడ్డి.



 ప్రస్తుతం తెలంగాణలో తిరుగులేని నేతగా కొనసాగుతున్న కేసీఆర్ను ఎదుర్కొనేందుకు.. కెసిఆర్ తరహాలోనే ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించేందుకు..  కెసిఆర్ కి కౌంటర్ ఇచ్చేందుకు సరైన నాయకుడు లేడు అని తెలంగాణ ప్రజలు భావిస్తున్న సమయంలో నేనున్నాను అనే విధంగా ఒక్కసారిగా తెర మీదికి వచ్చాడు రేవంత్ రెడ్డి. తన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించడమే కాదు.. ఇక కెసిఆర్ ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా మారిపోయారు. ఇక ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు పదవిలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి.



 అయితే కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఏ పార్టీ నాయకుడు చేయనంతగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టి పోస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పలుమార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం  రేవంత్ రెడ్డి ని జైలుకి పంపించినప్పటికీ బయటకు వచ్చాక కూడా అదే దూకుడుతో ముందుకుసాగారు. అయితే ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కి హాజరైన రేవంత్ రెడ్డి తన జీవిత లక్ష్యం ఏంటి అన్న విషయాన్ని తెలిపారు. కెసిఆర్ ని ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించమే తన లక్ష్యం అంటూ తెలిపాడు.  మరి కొన్ని రోజుల్లో సాధ్యమవుతుందని.. కెసిఆర్ ని ఓడించి అడవులకు పంపించాలి అనే కసి నాలో చాలా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: