
ఈ క్రమంలోనే చాలా మంది పార్టీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో జనసేన తో పొత్తు పెట్టు కోవాలని సూచనలు చేస్తున్నారు. జనసేన తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి 20 ఎమ్మె ల్యే, 4 వరకు ఎంపీ సీట్లు ఇస్తే మనం వైసీపీని సలువుగా ఓడించి అధికారంలోకి వస్తామని లెక్కలు వేసుకుంటున్నారు. ఒక వేళ జనసేన తో నిజంగా పొత్తు కుదిరితే కొందరు టీడీపీ నేతలు తమ సీట్లు వదులు కోక తప్పని పరిస్థితి. అప్పుడు పార్టీ లో కొందరు సీనియర్లు మాత్రమే కాకుండా.. సిట్టింగ్ ఎమ్మెల్యే లు సైతం తమ సీట్లు వదులు కోక తప్పని పరిస్థితి.
ఈ లిస్టులోనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సైతం తన సీటు త్యాగం చేయక తప్పదని అంటున్నారు. బుచ్చయ్య చౌదరి రాజమండ్రి అర్బన్ - రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల నుంచి మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ జనసేన తో పొత్తు ఉంటే రూరల్ సీటు జనసేనకే వెళుతుందని అంటున్నారు. అప్పుడు అక్కడ జనసేన లో బలమైన నేతగా ఉన్న కందుల దుర్గేష్ కే సీటు ఇస్తారని టాక్ ? అప్పుడు బుచ్చయ్య తన సీటు త్యాగం చేయక తప్పదని తెలుస్తోంది.