అయితే.. ఇప్పుడు ఓ కొత్త డిమాండ్ వస్తోంది. ఇండియన్ కరెన్సీపై ఉండాల్సింది గాంధీ బొమ్మ కాదు.. అంబేడ్కర్ బొమ్మ అంటూ కొందరు వాదిస్తున్నారు. భారతదేశ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ చిత్రాన్ని ముద్రించాలన్న డిమాండ్ కొందరు తెరపైకి తెస్తున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు డా.బండా ప్రకాష్ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఈ అంశాన్ని పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానంటున్నారు. రాజ్యసభ సభ్యుడిని కాబట్టి సభలో దీనిపై మాట్లాడతానంటున్నారు.
భారత కరెన్సీ నోటుపై అంబేడ్కర్ ఫోటోను సాధించడం కోసం అంబేడ్కర్ ఫొటో సాధన సమితి పేరుతో ఓ సంఘం కూడా ఏర్పడింది. ఈ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న జ్ఞాన యుద్ధ యాత్ర పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర జరుగుతుందట. ఈ యాత్ర
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14వ వరకు దేశవ్యాప్తంగా జరుగుతుందట.
ఈ జ్ఞానయుద్ధ యాత్ర’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఎంపీ బండ ప్రకాశ్ ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను బడుగు, బలహీన వర్గాలు దేవుడి కంటే మిన్నగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వల్లే తాము ఈ మాత్రం సమాజంలో ఉన్నామని వారు భావిస్తుంటారు. అందుకే ఇండియన్ కరెన్సీపై గాంధీ కాదు అంబేడ్కర్ చిత్రం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్ ఫలిస్తుందా..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి