గూగుల్ ప్రపంచంలోనే అత్యధికంగా వాడే సెర్చ్ ఇంజిన్.. అందుకే అంతా ఇప్పుడు ఏ విషయం తెలుసుకోవాలన్నా గుగులమ్మను అడుగుతుంటారు. ఇలా గూగుల్ మన జీవితాల్లో ఓ భాగం అయ్యింది. అయితే.. చాలా మంది గూగుల్ యూజర్లకు కూడా తెలియనిదేమిటంటే.. గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్ మాత్రమే.. అది కొత్తగా కంటెంట్‌ను క్రియేట్ చేయదు.. ఇప్పటికే ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం నుంచి మనం అడిగిన సమాచారాన్ని వెతికి మన చేతికి అందిస్తుంది.


అయితే.. ఇలా వెదికే సమయంలో అనేక లింకులను గూగుల్ మనకు సూచిస్తుంది. ఇలాంటి సమయంలోనే కొన్ని వివాదాస్పద కంటెంట్లను కూడా గూగుల్ మనకు చూపిస్తుంది. ఇలాంటి అంశాలపై గూగుల్‌కు చాలా మంది ఫిర్యాదులు కూడా చేస్తుంటారు.. అందుకే అక్టోబర్‌లో  భారత యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దాదాపు 50 వేల వివాదస్పద కంటెంట్లను తొలగించిందట. ఈ విషయాన్ని ప్రముఖ సెర్చ్‌ ఇంజీన్‌ సంస్థ గూగుల్‌ స్వయంగా వెల్లడించింది.


కస్టమర్ల నుంచి వచ్చిన 25వేల ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు గూగుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ 50 వేలు మాత్రమే కాదట.. మరో 4లక్షల  వరకూ పోస్టులను ఆటోమేటెడ్‌ డిటెక్షన్‌ విధానం ద్వారా గూగుల్‌ నుంచి తీసేసిందట ఆ సంస్థ. ఇక ఈ సందర్భంగా గూగుల్ కొన్ని పాత లెక్కలు కూడా చెప్పింది. గత  సెప్టెంబర్‌లో 30వేల వరకూ కస్టమర్ల నుంచి కంప్లయింట్లు వచ్చాయట. ఈ కంప్లయింట్లు ఆధారంగా మరో 80 వేల పోస్టులు తొలగించిందట. గత సెప్టెంబర్‌లోనే ఆటోమేటెడ్‌ డిటెక్షన్‌ ద్వారా 4. 50 లక్షల కంటెంట్లను తీసేసిందట.


ఇలా గూగుల్ తొలగించేవాటిలో ఎక్కువగా కాపీ రైట్‌ యాక్ట్‌ కు సంబంధించిన కంటెంటే ఉంటుందట. ఇవి కాకుండా ట్రేడ్‌ మార్క్‌ గురించి కొన్ని, కోర్టు ఆదేశాల ప్రకారం మరికొన్ని పోస్టులు, కంటెంట్లను గూగుల్ తొలగించిందట. వీటి తర్వాత అశ్లీల సమాచారం ఉన్న మరికొన్ని కంటెంట్లను కూడా గూగుల్ తొలగిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: