దేశంలో వెలుగులోకి వచ్చిన ఎక్కువ కేసులు కేరళలోనే వెలుగులోకి రావడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రజలందరూ అప్రమత్తమై తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పుడు కేరళ ప్రజలందరికీ మరో ప్రాణాంతకమైన మహమ్మారి భయపెడుతుంది.. మనిషి ప్రాణాలు తీయడానికి ఏదో ఒక కొత్త వ్యాధి తెరమీదికి వస్తూనే ఉంది. ఇప్పుడు కేరళలో బర్డ్ ఫ్లూ కేసులు పెరిగిపోతుండడంతో అందరూ భయపడిపోతున్నారు. గత కొంత కాలం నుంచి వేల సంఖ్యలో కోళ్లు బాతులు వివిధ రకాల పక్షులు కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి బారిన పడుతున్నాయి.
దీంతో ఇక రాష్ట్ర ప్రజానీకం మొత్తం వణికి పోతూ ఉండగా అటు అధికారులు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా ఏకంగా బలవంతంగా ప్రాణాలు తీస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కొట్టాయం జిల్లాలో గత రెండు రోజుల్లో 16 వేల 976 బర్డ్ ఫ్లూ సోకిన బాతులను గుంత తవ్వి అందులో దహనం చేశారు అధికారులు. మరోవైపు వైరస్ ను నిర్వీర్యం చేసేందుకు ఫారాలలో రసాయనిక ప్రక్రియ కూడా చేపడుతూ ఉండటం గమనార్హం. ఇలా బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి