ఆ మంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌ధ్య అంత కెమిస్ట్రీ ఎలా కుదిరింది. అదే జిల్లాకు చెందిన మరొక మంత్రిని నిత్యం టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఎందుకు క‌లివిడిగా తిరిగారు. రానున్న రోజుల్లో ఈ రాజ‌కీయ ప‌రిణామాలు జిల్లా రాజ‌కీయాల్లో మార్పులు తీసుకొస్తున్నాయా..? ఇంత‌కి ఎవ‌రూ ఆ మంత్రులు, ఎవ‌రూ ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు చూద్దాం..

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార, విప‌క్ష పార్టీల మ‌ధ్య వైరం అయినా.. స్నేహ‌మైనా హాట్ టాపికే ఇప్పుడు. అలాంటి అరుదైన దృశ్యాల‌కు సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న వేదికైన‌ది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డితో పాటు అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన‌డం కామ‌న్‌. వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు త‌రుచూ సంగారెడ్డి వెళ్లుతూ ఉంటారు.

ఆ కార్య‌క్ర‌మాల్లో మాత్రం జ‌గ్గారెడ్డి పెద్దగా క‌నిపించ‌రు. ఇద్ద‌రిదీ ఉమ్మ‌డి జిల్లానే కావ‌డంతో పొలిటిక‌ల్ గ్యాబ్ ఉన్న‌ది. అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా మంత్రి హ‌రీశ్‌రావును టార్గెట్ చేస్తుంటారు జ‌గ్గారెడ్డి. తాజాగా మంత్రి కేటీఆర్ సంగారెడ్డిలో ప‌ర్య‌టించిన విష‌యం విధిత‌మే. అయితే ఈ టూర్‌లో ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కూడా త‌లుక్కున మెరిసారు. అంతేకాదు.. కేటీఆర్ జ‌గ్గారెడ్డిలు కూడా.. కేటీఆర్‌, జ‌గ్గారెడ్డిల మ‌ధ్య క‌నిపించిన పొలిటిక‌ల్ కెమిస్ట్రీ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ కార్యక్ర‌మంలో మాత్రం మంత్రి హ‌రీశ్‌రావు క‌నిపించ‌లేదు.

మంత్రి హ‌రీశ్‌రావు హైద‌రాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో స‌మావేశం ఉండ‌డంతో.. హాజ‌రు కాలేక‌పోయారు. హ‌రీశ్‌రావు లేర‌నే ఏమో జ‌గ్గారెడ్డి అడ్వాన్స్ అయిన‌ట్టున్నారు. కేటీఆర్‌తో ఒక‌టే ఇక ఇక‌లు ప‌క‌ప‌క‌లు చేసారు. ఇదే కార్యక్ర‌మంలో ఇత‌ర టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్న‌ప్ప‌టికీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి ప్రాధాన్య‌త ఇచ్చార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మొద‌టి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి హ‌రీశ్‌రావుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించే జ‌గ్గారెడ్డి.. కానీ కేటీఆర్ విష‌యంలో నెగిటివ్ కామెంట్స్ చేసిన దాఖ‌లాలు లేవు. గ‌తంలో  ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మంత్రి హ‌రీశ్‌రావును స‌న్మానించిన త‌రువాత ఎడ‌మొఖం, పెడ‌మొఖంతో ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జ‌గ్గారెడ్డి భార్య నిర్మ‌ల పోటీ చేసారు. ఎమ్మెల్సీ ఓట్ల‌లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల‌లో ఒక్క ఓటు త‌గ్గినా.. పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వీకి రాజీనామా చేస్తాన‌ని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేసారు.

చివ‌రికి కాంగ్రెస్‌కు ఉన్న ఓట్ల కంటే 8 ఓట్లు ఎక్కువ‌గానే వ‌చ్చాయి. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి త‌గ్గ‌లేదు. ఇలాంటి స‌మ‌యంలో మంత్రి కేటీఆర్ రావ‌డంతో జ‌గ్గారెడ్డి రియాక్ష‌న్ ఏమిటా అని అంతా ఆస‌క్తిగా చూసారు. కేటీఆర్‌, జ‌గ్గారెడ్డి కెమెస్ట్రీ చూసాక‌.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ శ్రేణుల‌కు మైండ్ బ్లాక్ అయింది. ఈ కెమెస్ట్రీ.. ఎప్ప‌టివ‌ర‌కు ఉంటుంది. రానున్న రోజుల్లో జిల్లా రాజ‌కీయాల‌కు ఏమైనా నాంధి ప‌లుకుతుందా.. లేక యాదృశ్చికంగానే వారి సంభాష‌ణ‌లు చోటు చేసుకున్నాయో వేచి చూడాలి మ‌రీ.


మరింత సమాచారం తెలుసుకోండి: