కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్ 25నుంచి రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివాహాలకు 200మందికి మించి అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే ఆ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

దేశేంలో ఒమిక్రాన్ వేరియంట్ కలవరం తగ్గడం లేదు. 24గంటల వ్యవధిలోనే దేశంలో 100కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 358మంది ఈ ప్రమాదకర వేరియంట్ బారిన పడ్డారు. 114మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 88మంది ఈ వైరస్ బారిన పడగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఢిల్లీలో 67, తెలంగాణలో 38కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరికి ఈ వైరస్ సోకింది.

ఇక దేశంలో గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 6వేల 650కరోనా కేసులు నమోదయ్యాయి. 7వేల 51మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 374మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 77వేల 516కాగా.. ఇప్పటి వరకు 4లక్షల 79వేల 133మంది కరోనా వైరస్ సోకి మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

ఇక ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకరికి, తూర్పుగోదావరి జిల్లాలో మరొకరికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. తాజాగా ఈ వైరస్ సోకిన ఇద్దర్ని విశాఖలోని క్వారంటైన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కేసుల సంఖ్య 360కి చేరింది. తెలంగాణలో 38మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

మరోవైపు బల్గేరియాలో పదవీ విరమణ పొందిన వ్యక్తులు కరోనా టీకా వేయించుకుంటే వారికి నగదు బహుమతి ఇస్తామని ఆ దేశ ప్రధాని కిరిల్ పెట్కోల్ ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరు నెలల వరకు వారికి పెన్షన్ తో పాటు 43.40డాలర్లు అదనంగా అందిస్తామని చెప్పారు. కాగా బల్గేరియాలో 27శాతం జనం మాత్రమే టీకా తీసుకున్నారు. దీంతో వ్యాక్సినేషన్ లో ఆ దేశం చాలా వెనుకబడిపోయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: