ప్రస్తుతం అందరూ ఆధునిక సమాజంలో కి అడుగు పెడుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే వివక్ష ఎక్కడ చూపించడం లేదు. పురుషులతో సమానంగానే మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇక అన్ని విషయాల్లో కూడా పురుషులతో సమానంగా మహిళలు సమాన హక్కులు కలిగి ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి ఆధునిక సమాజంలో కూడా అక్కడక్కడా కొన్ని చిత్రమైన ఆచారాలు వెలుగులోకి వస్తు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పటికి కూడా దేశంలో కొన్ని దేవాలయాల్లో కి  ఆడవాళ్లకు ఎంట్రీ లేకపోవడం గమనార్హం. ఇక ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాలను నేటి రోజుల్లో కూడా ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.



 ఇక మహిళలు కూడా పురుషుల కంటే మేమేం తక్కువ.. మేం ఎందుకు గుడి లోకి వెళ్ళకూడదు అని అనుకోకుండా దేవుడి తో ఆటలు ఎందుకు ఒకప్పటి ఆచారాలను పాటిద్దాం అంటూ అనుకుంటున్నారు. ఇక ఇటీవల ఏపీలోనీ ఒక ఆలయం కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక్కడ ఓ ఆలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. కారణం ఇక ఆలయంలోకి కేవలం మగ వాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఆడవాళ్ళు ఆలయం బయట నుంచే దేవుడిని మొక్కుకుంటారు.



 ఏపీ లోని కడప జిల్లా తిప్పాయపల్లె లో ఉన్న సంజీవరాయ స్వామి ఆలయానికి ఈ ప్రత్యేకత ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రతి ఏటా సంక్రాంతి కి ముందు వచ్చే ఆదివారం రోజున కేవలం మగవాళ్ళు మాత్రమే స్వామివారికి పొంగలి పెట్టడం చేస్తూ ఉంటారు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోందని ప్రజలు చెబుతున్నారు. ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఉండదు.. బయటినుంచి స్వామివారిని దర్శించుకుంటారు మహిళలు. అంతేకాకుండా స్వామికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని కూడా మహిళలు ముట్టరు. సంజీవరాయుడు కి ఆలయం ఉండదు కేవలం ఒక రాతిపై చెక్కిన విగ్రహానికి ఇలా నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఇలా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజున పొంగళ్ళు పెడితే మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: