ఇప్పుడు దేశమంతా బూస్టర్ డోసుగా మూడవ కరోనా వ్యాక్సిన్ ను డోసుగా ఇవ్వడానికి చూస్తున్న విషయం తెలిసిందే. దానితో ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వస్తుంది. ఇప్పటికే రెండు డోసులు ఎలాగూ వేసుకున్నాము కదా ? మూడవ డోసు వేసుకోవడం ఖచ్చితంగా అవసరమా? అన్న చర్చ మొదలైంది. ఇలా వరుసగా డోసులు వేసుకోవడం వలన రోగ నిరోధక శక్తి దెబ్బతింటుందేమో అన్న అనుమానం కలుగుతోంది. ఈ విషయంపై యురోపియన్ యూనియన్ నియంత్రణ సంస్థలు వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక వ్యాక్సిన్ కు మరియు ఇంకొక వ్యాక్సిన్ కు మధ్యన ఎక్కువ సమయం ఉండడం అవసరం అని, ఇప్పుడు చేస్తున్న విధంగా నాలుగు నెలల లోపు వ్యాక్సిన్ లు ఇవ్వటం వల్ల శరీరంలో వ్యతిరేక స్పందనలు కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఇలా బూస్టర్ డోసులు ఇవ్వడానికి ప్లాన్ చేస్తే...అధిక సమయం ఉండేలా చూసుకోవడం ఆమోదయోగ్యం అని చెబుతున్నారు. అంతే కాకుండా ఇలా బూస్టర్ డోసులు ఇవ్వడానికి శీతాకాలం ఎంతో అనువైన సమయం అని వీరు సలహా ఇస్తున్నారు. అయితే ఈ ప్రకటన తర్వాత ఇప్పటికే బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియలో ముందున్న దేశాలు వెనక్కు తగ్గుతాయా? లేదా వాటి ప్రణాళికల ప్రకారం బూస్టర్ డోసులు అందిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి