ఇటీవలే సైబర్ నేరగాళ్లు ఎంతలా రెచ్చిపోతున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనాలు ఎవరైనా కాస్త నిర్లక్ష్యంగా కనిపించారు అంటే చాలు ఇక ఏదో ఒక విధంగా వారి వ్యక్తిగత డేటాను సేకరించి చివరికి ఖాతాలు ఖాళీ చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది అమాయకులను టార్గెట్గా చేసుకుంటూ ఇటీవలికాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్న తీరు అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో మొబైల్ లో ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరపాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో.


 అయితే అటు ఒకవైపు రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నప్పటికి మరోవైపు మాత్రం జనాలలో నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కాస్త ఫ్రీగా వస్తుంది అంటే చాలు ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధమైపోతున్నారు. ముఖ్యంగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫ్రీ వైఫై వచ్చిందంటే చాలు ఇక అందరూ మురిసిపోతూ మొబైల్ కి కనెక్ట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ ఎలాంటి పాస్వర్డ్ పెట్టకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఫ్రీ వైఫై ఎందుకు పెట్టుకున్నారు అన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. అయితే ఇలా ఎంతోమంది వైఫై ఫ్రీగా వచ్చిందని కాస్త కక్కుర్తి పడడంతో చివరికి సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేసి ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫ్రీ వైఫై వుంది అంటే కాస్త వెనక ముందు ఆలోచించాలి అంటూ అటు అధికారులు సూచిస్తున్నారు. ఇక ఫ్రీగా వస్తుంది కదా అని వైఫై కనెక్ట్ చేసుకున్నారు అంటే మాత్రం యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు దొంగలించే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ బెంగళూరు ముంబై లాంటి ప్రముఖ నగరాల్లో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. ఒకసారి ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత సైబర్ నేరగాళ్లు మొబైల్ లోకి చొరబడి వ్యక్తిగత వివరాలను తెలుసుకుని ఆ తర్వాత బెదిరింపులకు దిగుతున్నారని అంటూ చెప్పుకొచ్చారు. ఇలా సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేయడంతో ఎంతో మంది యూజర్లు చివరికి భారీగా డబ్బులు  ఇస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయని అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: