వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామాను వాయిదా వేసుకున్నట్లున్నారు. తాను ఎంపీ పదవికి మొన్నటివరకు ఫిబ్రవరి 5వ తేదీని గడువుగా అయనే చెప్పుకున్నారు. కానీ లేటెస్టుగా మేనెల 14వ తేదీకి మారినట్లు సమాచారం. ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరిగిపోతుందని ఏమిటేమిటో చెప్పారు. కానీ తాజాగా మే 14వ తేదీ తర్వాతనే రాజకీయాల్లో మార్పులుంటాయని చెప్పారు. దాంతో రాజీనామా తేదీని వాయిదా వేసుకున్నట్లుగా అర్ధమవుతోంది. అసలు రాజీనామా చేస్తో కూడా డౌటుగానే ఉందిపుడు.




ముందుగా చెప్పినట్లు ఫిబ్రవరి 5వ తేదీ అయినా తాజాగా చెబుతున్నట్లు మే 14వ తేదీ అయినా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులుంటాయో ఎంపీకి మాత్రమే తెలియాలి. ముందు ఎంపీ పదవికి రాజీనామా చేయాలి, తర్వాత ఉపఎన్నికలు రావాలి. రఘురాజు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో ఫైనల్ అవ్వాలి. మిగిలిన పార్టీలు మద్దతిస్తాయో లేదో తేలాలి. నామినేషన్ వేసి ప్రచారం మొదలుపెట్టిన తర్వాత కదా రఘురాజు గెలిచేది లేనిది తెలిసేది.




తాను గెలవాలంటే ముందు జరగాల్సిన తతంగం ఇంతుండగా రాజు మాత్రం నామినేషన్ వేస్తే చాలు గెలిచినట్లే అన్నంతగా బిల్డప్ ఇస్తున్నారు. రాజీనామా వాయిదా వేసుకున్నారనే ప్రచారం వెనుక ఒక ఇంట్రస్టింగ్ విషయం ఉందట. అదేమిటంటే తాను చేరబోయే పార్టీ ఏది ? మద్దతిచ్చే పార్టీలేవి అనే విషయంలో క్లారిటి రాలేదట. స్వతంత్ర అభ్యర్ధిగా ఉమ్మడి పార్టీల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేయటం అనేది వినటానికి మాత్రమే బాగుంటుంది.




కానీ ఆ తర్వాత ఆయా పార్టీలకు ఎదురయ్యే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. అధికార పార్టీ సంధించే ఆరోపణలకు, విమర్శలకు ప్రతిపక్షాలు సమాధానలు చెప్పుకోవటం అంత ఈజీకాదు. కాబట్టి రఘురాజు ఏదో పార్టీలో చేరి పోటీ చేయాల్సిందే. ఇపుడు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో కొన్ని ప్రతిపక్షాలు మద్దతిచ్చినా భవిష్యత్తులో ఎదురయ్యే చాలా సవాళ్ళకు సమాధానం చెప్పటం అంత తేలిక్కాదు.




2018లో తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందుకే చంద్రబాబు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. పైగా రేపు నరసాపురంలో ఉపఎన్నిక వచ్చినా రాజుకు ఎన్నిపార్టీలు మద్దతిస్తాయో అనుమానమే. సో ఇలాంటి సమస్యలు తేలకుండానే తాను రాజీనామా చేసి ఉపయోగంలేదనే రఘురాజు తన రాజీనామాను వాయిదా వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: