సాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు అందరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి భయపడిపోతుంటారు. ఇక సాధారణంగా మన చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా చలి గా ఉంటే పూర్తిగా పొగ మంచుతో కప్పుకు పోతూ ఉంటుంది. ఇలా పొగమంచు చూసినప్పుడు వామ్మో చలి ఎంత పెరిగిపోయిందో అంటూ అనుకుంటూ ఉంటాం. కానీ విదేశాల్లో మాత్రం చలికాలంలో మంచు పేరుకుపోవడంతో కాదు ఏకంగా ఎక్కడికక్కడ గడ్డకట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. అందుకే వింటర్ సీజన్ లో ఎక్కువగా మంచు ఉండే పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఇక అక్కడ ఉన్న అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించడానికి అందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.



 అమెరికా కెనడా లాంటి దేశాలలో ఇలా శీతాకాలంలో మంచు ఎక్కువగా కురవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎన్నో ప్రాంతాలు మంచులో కూరుకుపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సాధారణంగా పైనుంచి మంచి కురవడం లాంటిది ఇప్పటి వరకు చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక జలపాతం గడ్డ కట్టకు పోవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలి కాలంలో పర్యాటకులపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎంతోమంది అమెరికాకు ప్రత్యామ్నాయంగా కెనడాకు వెళుతూ ఉండడం గమనార్హం. చదువులు ఉద్యోగాలు అన్నీ కూడా కెనడా కు వెళ్లడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.


 అయితే ఇటీవలి కాలంలో కెనడాలో విపరీతంగా మంచు కురవడం మొదలైందట. అయితే ఏకంగా వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ రావడం  కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇలా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే నీళ్లు కూడా పూర్తిగా ఐస్ లా మారిపోయాయట. కెనడాలోని ఒంటారియో జలపాతం వద్ద ఇక ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో ఇది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: