త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఓ వివాదంలో భాగంగా కోర్టు బోనులో ఇరుక్కుంది.అక్క‌డ జాతీయ భాష హిందీ బోధ‌న‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించ‌క‌పోవ‌డంతో  సీఎం స్టాలిన్  చిక్కుల్లో ప‌డ్డారు.పిటిష‌న‌ర్ల వాద‌న విన్న మ‌ద్రాసు కోర్టు కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన మాట‌లు చెప్పింది.ఇవి మాతృభాష‌ను నేర్చుకోవ‌డంతో పాటు ఇతర భాష‌లు నేర్చుకునేందుకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలో చెప్ప‌క‌నే చెబుతున్నాయి. ఇదే వివాదం మ‌న తెలుగు రాష్ట్రాల‌లోనూ ఉంది. ఇంగ్లీషు మాధ్య‌మం పై ప్రేమ‌తో బోధ‌నాంశంగా కాకుండా పాఠ్యాంశంగా తెలుగును ఉంచ‌డంపై విమ‌ర్శ‌లు ఉన్నాయి. అక్క‌డ వ‌చ్చిన వివాదం ఇక్క‌డ వ‌చ్చిన వివాదం రెండూ భాష‌కు సంబంధించిన‌వే! త‌మిళులు త‌మ‌కున్న విప‌రీతం అయిన భాషాభిమానం కార‌ణంగా హిందీ నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌రు. ఇక్కడ ఇంగ్లీషు చ‌దువుల‌పై ప్రేమ కార‌ణంగా మ‌న పాల‌కులే ద‌గ్గ‌రుండి మ‌రీ ! తెలుగును పాఠ్యాంశంగా చేసి బోధ‌నాంశంగా మాత్రం నామ మాత్ర రీతికే ప‌రిమితం చేశారు.


దేశ వ్యాప్తంగా భాషాభిమానం ఎక్కువ ఉన్న రాష్ట్రాల‌లో ద‌క్షిణాదికి చెందిన త‌మిళ‌నాడు ఒక‌టి. విప‌రీతం అయిన భాషాభిమానం కార‌ణంగానే కొన్ని వివాదాలు కూడా వ‌చ్చేయి.అయినా కూడా వారు హిందీ అంటే ఓ చిన్న  చూపుతూనే ఉంటారు. ఎందుకు నేర్పాలి లేదా ఎందుకు నేర్చుకోవాలి అన్న వాద‌న ఒక‌టి ఎన్న‌డూ వినిపిస్తూనే ఉంటారు.ఇప్పుడు నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాలసీ లో భాగంగా హిందీ పాఠాల బోధ‌న త‌ప్ప‌ని సరి అయినా త‌మిళ‌నాడు పెద్ద‌గా ఆ సూత్రం అమ‌లు కావ‌డం లేదు.త్రిభాషా సూత్రం  అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించారు. ఈ సంద‌ర్భంగా మ‌ద్రాసు న్యాయ స్థానం ఆస‌క్తిదాయ‌క వ్యాఖ్య‌లు చేసింది. నేర్చుకోవ‌డం వేరు బోధించ‌డం వేరు ఎవ‌రికి వారే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో హిందీని నేర్చుకుంటున్నార‌న్న అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ మాటల‌పై ఆ విధంగా స్పందించి ప్ర‌భుత్వానికి మొట్టికాయలు వేసింది.హిందీ బోధ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేన‌ని కూడా అభిప్రాయ ప‌డింది. ఇక దీనిపై స్టాలిన్ ఏమంటారో అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా ఉంది.హిందీ భాష బోధ‌న‌కు సంబంధించి రేగిన వివాదం ఇది.దీనిపై మ‌ద్రాసు హై కోర్టు స్పందించింది.పిటిష‌నర్ వాద‌న‌లు విన్నాక నాలుగు వారాల్లో స్పందించాల‌ని ప్ర‌భుత్వ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ను ఆదేశించింది.అక్క‌డ ఏం జ‌రిగిందంటే.. జాతీయ విద్యావిధానంపై రాష్ట్రాలలో వివాదాలు రేగుతున్న సంగ‌తి తెలిసిందే. మూడు భాష‌ల‌ను బోధించ‌డం అన్న‌ది త‌మ‌కు అధిక భార‌మేన‌ని, విద్యార్థి కి ఒత్తిడితో కూడుకున్న ప‌నే అని ప్ర‌భుత్వం త‌న వాద‌న వినిపించింది.దీనిపై ధ‌ర్మాస‌నం స్పందించి హిందీ రాక‌పోవ‌డం వ‌ల్ల‌నే చాలా మంది కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించింది.ఉద్యోగ,ఉపాధి అవ‌కాశాల కోసం మాతృభాష‌తోపాటు ఇత‌ర భార‌తీయ భాష‌లు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: