ఓవైపు కరోనా మరోవైపు ద్రవ్యోల్బణం తో బడ్జెట్ పైనే ఆశలు పెరుగుతున్నాయా..? ఆర్థిక మంత్రి ఉపశమనాలు ఇస్తారా? లేదా అన్నదే కీలకంగా మారిందా..?ఈ ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపు ధరల దృష్టి అంతా దాని పైనే ఉంది. ఓ వైపు ద్రవ్యోల్బణం పెరిగి రోజు వారి ఖర్చులు భారంగా మారిన వేళ కరోనా రూపంలో వైద్య ఖర్చులు అదనంగా వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ కోసం ఏమైనా ఉపశమనాలు ప్రకటిస్తారన్న ఆశతో సామాన్య పన్ను చెల్లింపుదారులు వేచి చూస్తున్నారు.

ముఖ్యంగా ఆదాయ పన్ను మినహాయింపు, పరిమితి పెంపు, పెట్రోల్,డీజిల్ పై సుంకాల తగ్గింపు వంటి ఉపశమనాలను కోరుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్ లో పన్ను రేట్లను తగ్గిస్తే తద్వారా ఆ ప్రయోజనాన్ని ప్రజలు నేరుగా పొందగలుగుతారు. బడ్జెట్ 2022 నుంచి పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్న అతిపెద్ద ఉపశమనం ఇదే. ఆదాయ పన్ను స్లాప్ లను విస్తరిస్తూ ప్రభుత్వం గతంలో తక్కువ పన్ను రేటును అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత విధానంతో పాటు కొత్త దాంట్లో గరిష్ట పన్ను, గరిష్ట పన్ను రేటు 30 శాతంగా ఉండడం గమనార్హం. దీంతో చాలామంది పాత పన్ను విధానాన్నే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని  డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు దీన్ని పది లక్షల వరకు పెంచాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు కార్పొరేట్ పన్ను తగ్గించి దేశీ కంపెనీలకు కొంత ఊరట కల్పించారు. ఈ నేపథ్యంలో సామాన్య వేతనం ఇతర పన్ను చెల్లింపుదారులు పన్ను రేటు తగ్గించాలని కోరుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే సదుపాయాలు కలిపిస్తున్నాయి. ఇవి చిరుద్యోగులకు రానురాను భారంగా మారుతోంది. కార్యాలయాల్లో పని చేసేటప్పుడు కంపెనీలు కల్పించే వసతులన్నీ సొంతడబ్బుతో సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మహమ్మారి వ్యాప్తితో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజలను భయపడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఖర్చులను కూడా యాన్యుటీ
పరిధిలోకి తీసుకు వస్తే కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. పెన్షన్ ఆధారిత స్కీమ్ ల కాలపరిమితి ముగిసిన తర్వాత కనీసం 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ కింద మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ యాన్యుటీ మొత్తంపై పన్ను విధిస్తున్నారు. పిఎఫ్ నుంచి లభించే అదనపు వడ్డీ పై కోతను తగ్గించడం సాధ్యంకాని పక్షంలో కనీసం యాన్యుటీ మొత్తంపై పన్ను నుంచైనా  ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ చాలా కాలం గా వినిపిస్తోంది. కుదరకపోతే కనీసం ప్రస్తుతం ఉన్న సుంకాలనైనా తగ్గించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో సామాన్యులు కేంద్ర బడ్జెట్ పై అనేక ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్,స్టార్టప్, రిటైల్ రంగం, ఐటీ రంగం సహా ఇతర రంగాలకు కరోనా నేపథ్యంలో ఉపశమన ప్యాకేజీలు ప్రకటిస్తారని భావిస్తున్నారు.


ఈసారి బడ్జెట్ నుండి ఐటీ రంగం రిస్క్ క్యాపిటల్ కు ఉపశమనం కలిగించడానికి పన్ను మినహాయింపును ఆశిస్తోంది. పెట్టుబడులను పెంచడం కోసం ఐటి కంపెనీలు బడ్జెట్లో రాయితీలు ఆశిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ ప్రభుత్వానికి ఇది పదవ బడ్జెట్. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో పన్ను స్లాప్ లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: