గృహ హింస కేసులను తగ్గించడం కోసం ప్రభుత్వాలు ఎన్నో కొత్త చట్టాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. అయిన కూడా కొన్ని ప్రాంతాలలో మహిళలు ఇబ్బందులకు గురవుథున్నారు.  ఈ విషయం పై ప్రభుత్వం కూడా ఏమి చేయలేక పోతుంది. నాగరికత తెలియని వాళ్ళు అనుకుంటే ఏమైనా అనుకోవచ్చు..కానీ చదువుకున్న వాళ్ళే ఇలా చెస్తె ఇక సమాజం లో ఎక్కడ మార్పు ఉంది.ఆడవాళ్లకు అండగా ఉండాల్సిన పాలకులు, అధికారులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఈక్రమంలో మలేషియాకు చెందిన ఓ మహిళా మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆమె పదవికే ఎసరు తెచ్చిపెట్టాయి. 



ఆమె అన్న మాటలు గృహ హింసను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ కొందరు దుమ్మెత్తి పొస్తున్నారు.. వివరాల్లొకి వెళితే.. మలేషియాకు చెందిన ఫ్యామిలీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ మినిస్టర్‌ సిటి జైలా మొహమ్మద్ యూసోఫ్ ‘ మదర్స్‌ టిప్స్‌ అనే పేరు తో ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. అందులో ఆమె మొండిగా వుండే భార్యాలను కొట్టడం లో ఎటువంటి తప్పు లేదు అని అన్నారు..అది ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. 



మొండిగా ఉంటున్న భార్యాల పై భర్తలు దారి పెట్టాలంటే సున్నితంగా కొట్టాలి అని ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది.అప్పటికీతీరు మార్చుకోకపోతే వారికి దూరంగా ఉండడం ఉత్తమం. అంతేకాదు మహిళలు తమ భర్తతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి’ అని భర్తలకు సలహాలు ఇచ్చింది. కొన్ని టిప్స్ కూడా ఇచ్చింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ప్రజలను మంచి మార్గంలో తీసుకెల్లాల్సిన ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న మంత్రి ఇలా మాట్లాడటం బాధాకరం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చెస్తున్నారు.జాయింట్ యాక్షన్ గ్రూప్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ, మహిళా హక్కుల సంఘాలకు చేరింది. ఈ వాఖ్యలు దుమారం లేపడంతో ఆమె పదవికి రాజీనామా చెయాలాని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: