ఏపీ సీఎం జగన్‌ రాజీనామా చేస్తానని టీడీపీకి సవాల్ విసిరారు.. తాను గవర్నర్‌ను అవమానించినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాన్ననారు. మీరు నిరూపిస్తే మా మంత్రిమండలిని రద్దు చేసుకుంటా.. అని జగన్ సీరియస్‌ గా స్పందించారు. ఇదంతా నిన్న బీఏసీ మీటింగ్ సమయంలో జరిగింది. గవర్నర్ ప్రసంగంపై టీడీపీ నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత బీఏసీ మీటింగ్ జరిగింది. ఆ సమయంలో  సీఎం జగన్  తీవ్రంగా స్పందించారట.


రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్‌ను అవమానిస్తారా అని జగన్ సీరియస్ అయ్యారట.. ఇదేం పద్ధతి... కనీసం గవర్నర్ వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా..  అది ఇవ్వకుండా కాగితాలు చించేసి ఆయనపై విసరడం ఏంటి అని సీఎం జగన్ టీడీపీ తీరుపై మండిపడ్డారట. అంతే కాదు.. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటివి లేవని.. టీడీపీ సభ్యుల తీరు అసెంబ్లీ పవిత్రతను నాశనం చేసేలా ఉందని జగన్ అసహనం వ్యక్తం చేశారట. దీనికి స్పందించిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు.. గతంలో మీరూ చేశారు కదా అని  బదులిచ్చారట. అంతే కాదు.. గవర్నర్‌ ప్రసంగానికి నిరసన తెలపడం ఇదేమీ తొలిసారి కాదు కదా అని అచ్చెన్నాయుడు సమర్థించుకున్నారట.


దీంతో మరింత కోప్పడిన జగన్.. తామెప్పుడూ ఇలా చేయలేదని.. తాము చేశానని చూపిస్తే నేను సీఎం పదవికి రాజీనామా చేస్తానని మరోసారి గట్టిగా చెప్పారట. దాంతో అచ్చెన్న కాస్త తగ్గారు.. మీరంటే మీరు చేశారని కాదు.. గవర్నర్‌ ప్రసంగానికి నిరసన తెలపడమనేది గతంలోనూ జరిగింది కదా అనేదే తన ఉద్దేశమని అచ్చెన్నాయుడు సర్ది చెప్పినట్టు తెలిసింది. మొత్తానికి ఈ సందర్భంగా జగన్ ఆవేశపడడం చర్చనీయాంశమైంది.


ఈ విషయానికి సీఎం జగన్ అంతగా రియాక్షన్ అవ్వాల్సిన అవసరం ఏముందని టీడీపీ నేతలు గొణుక్కుంటున్నారు. అసెంబ్లీ వ్యవహారాల విషయంలో గతంలోనూ వైసీపీ దారుణంగా ప్రవర్తించిందని.. సభావ్యవహారాలు గాడి తప్పడం ఒక్క టీడీపీతోనే మొదలైందన్నట్టు సీఎం మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు లోలోపల ఉడుక్కుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: