ఈ యుద్ధం వలన పెట్రోల్ డీజల్ ధరలు పెరుగుతాయని రోజుకో వార్త వస్తూ సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక వంట నూనెల ధరలు అయితే, పెరుగుతాయి అని వార్త వచ్చిన దానికే వ్యాపారులు వారికి వారే పెంచుకుని ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. కాగా తాజాగా ఒక అణుబాంబు లాంటి వార్త అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
మన పక్క దేశం అయిన శ్రీలంక పై కూడా ఈ యుద్ధం యొక్క ప్రభావం పడింది. ఇక్కడ ఎవ్వరూ ఊహించని రీతిలో చమురు ధరలు పెరగడం వలన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. అసలు ఈ ధరలు చూస్తే ఇండియాలో ఒక్కరికి కూడా నోరు మెదపదు, అంతలా పెరిగాయి.
చమురు ధరలు పెరిగిన తర్వాత ఒక లీటర్ పెట్రోల్ రూ. 50 పెరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా లీటర్ డీజెల్ ధర రూ. 75 పెరిగింది. ఈ విషయాన్ని LIOC అధికారికంగా ప్రకటించింది. పెరిగిన ధరలతో శ్రీలంక లో ప్రస్తుతం పెట్రోల్ రూ. 254 మరియు డీజిల్ రూ. 214 అయింది. అయితే అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరల కారణంగా ఇంత మొత్తంలో ధరలు పెంచినా నష్టాలు వస్తున్నట్లు LIOC తెలిపింది. .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి